హమ్మయ్య బన్నీ సేఫ్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
దేవర సినిమా” ఇప్పుడు సాధారణ సినిమా ప్రేక్షకులకే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా రక్త కన్నీరు కార్చిన సినిమా. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఎదురు చూసిన జనాలకు రేంజ్ ఏం లేదు జస్ట్ సినిమానే అనుకునేలా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.
దేవర సినిమా” ఇప్పుడు సాధారణ సినిమా ప్రేక్షకులకే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా రక్త కన్నీరు కార్చిన సినిమా. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఎదురు చూసిన జనాలకు రేంజ్ ఏం లేదు జస్ట్ సినిమానే అనుకునేలా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. సినిమాపై ఉన్న భారీ అంచనాలు, సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత నెగటివ్ ప్రచారం జరిగినా సినిమా విషయంలో ఫ్యాన్స్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. పక్కా రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని ఎదురు చూసారు.
కాని కానీ కానీ సినిమా చూసాక అర్ధమైంది, అంచనాలు పెంచుకుని తప్పు చేసాం అని. సెంటిమెంట్ లు నెగటివ్ టాక్ లే కరెక్ట్ మనం కాదని బయటకు వస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇక్కడ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ కొరటాల మీద కోపంగా ఉన్నారు కాబట్టి హ్యాపీ. మరి అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారు అంటారా…? అసలు ఈ కథను అల్లు అర్జున్ తో తీయాల్సింది కొరటాల శివ. కొన్ని కారణాలతో ఆ కథ ఎన్టీఆర్ వద్దకు వచ్చింది.
ఎన్టీఆర్ వెనకాముందు ఆలోచన లేకుండా ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా సమయం కేటాయించాడు అని ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ సినిమా మా హీరోతో చేయలేదని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కు ఫ్లాప్ పడిందనే బాధ వారిలో కూడా కాస్త ఉంది. కారణం ఎన్టీఆర్ కు బన్నీకి ఉన్న స్నేహం. దాని కంటే ముఖ్యం… ఈ సినిమా అల్లు అర్జున్ చేయకపోవడం. చేసి ఉంటే మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ బాధ పడేవారు అంటున్నారు సినీ జనాలు. ఏది ఎలా ఉన్నా దేవర మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.