NTR కి ఐకాన్ స్టార్ ఫిదా.. ! బావ కళ్లల్లో ఆనందం.. !
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. ఫిదా అవటం అంటే అలా ఇలా కాదు, సాలిడ్ గానే ఎన్టీఆర్ స్ట్రాటజీకి ఫ్యానైపోయాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. ఫిదా అవటం అంటే అలా ఇలా కాదు, సాలిడ్ గానే ఎన్టీఆర్ స్ట్రాటజీకి ఫ్యానైపోయాడు. బేసిగ్గా ఎన్టీఆర్ ని బన్నీ బావా అనిపిలుస్తాడు. బన్నీని కూడా ఎన్టీఆర్ బావా అనే సంభోదిస్తాడు… ఇప్పుడు ఒక బావ వల్ల మరో బావ కల్లలో ఆనందం కనిపిస్తోంది. ఎన్టీఆర్ వల్ల బన్నీకి బంపర్ ఆఫర్ తగిలినట్టే కనిపిస్తోంది. ఇంతవరకు పాన్ ఇండియా లెవల్లోనే కాదు, లోకల్ గా కూడా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరో లేడు. కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే దేవర హిట్ తో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే స్టామినా ఉందని తేలింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ స్టామినా తనకి కావాలంటున్నాడు బన్నీ. అందుకోసం డైరెక్ట్ గా ఎన్టీఆర్ సాయమే తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ కూడా చరణ్ కి బుచ్చిబాబుని గిఫ్ట్ గా పంపినట్టు, ఇద్దరు దర్శకులని బన్నీ ఎకౌంట్ లో వేస్తున్నాడు.. ఈ బ్రో మాన్స్ ఏంటో చూసేయండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన గురువు రాజమౌళి సెంటిమెంగ్ ని దేవరతో బ్రేక్ చేయటం కొత్త విషయం కాదు. ఆ రికార్డు క్రియేట్ అయ్యి ఆరునెల్లు గడుస్తోంది. కాని పాన్ ఇండియా హీరోల్లో ఇలాంటి రికార్డు తనొక్కడికే సొంతం. అదే ఎందుకో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నిద్రపోనీయట్లేదు. అందుకే తన దారిలో నడవటమే కాదు, ఎన్టీఆర్ కి అలాంటి రికార్డుని ఇచ్చిన దర్శకుడిని కూడా తన దారిలోకి తెచ్చుకోవాలన్నదే తన ఫస్ట్ టార్గెట్.అక్కడే తను సక్సెస్ అయ్యాడు. ఆ విషయంలో ఎన్టీఆర్ ఒకటి కాదు, ఏకంగా రెండు సాయాలు చేశాడు. దేవర తో రాజమౌళి సాయం లేకుండానే హిట్ మెట్టెక్కొచ్చని ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడు. రాజమౌళి తో హిట్ పడ్డాక మరే హీరో కూడా కోలుకోలేడన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలిగాడు. అచ్చంగా అలాంటి స్టామినానే బన్నీ కోరుకుంటున్నాడు. కాకపోతే తనేం రాజమౌలితో మూవీ చేయలేదు.
కాని పాన్ ఇండియా లెవల్లో వరుసగా 2 హిట్లు సొంతం చేసుకున్నాడు. కాని ఆ రెండూ కూడా ఒకే మూవీ ని రెండు భాగాలుగా మారిస్తే వచ్చిన సినిమాలు. సో పుష్ప రాజ్ గా రెండు సార్లు హిట్ మెట్టెక్కిన బన్నీ, ఇక మీదటే పాన్ ఇండియా లెవల్లోతన ఒరిజినల్ స్టామినాను ప్రూవ్ చేసుకోవాలి. కలిసొచ్చిన పుష్ప నే రెండో సారి రెండో భాగంగా చేసి 1850 కోట్ల వసూళ్లు రాబట్టాడు.సో అచ్చంగా బాహుబలి1, బహుబలి 2 తర్వాత ప్రభాస్ పరిస్థితి, పుష్ప2 భాగాల తర్వాత బన్నీ పరిస్థితి సేమ్ టు సేమ్. కాకపోతే అక్కడ డైరెక్టర్ రాజమౌళి, ఇక్కడ దర్శకుడు సుకుమార్ అదే తేడా… కేజీయఫ్ రెండు భాగాల తర్వాత కన్నడ హీరో యశ్ పరిస్థితి ఇలానే ఉంది. అందుకే పాన్ ఇండియా లెవల్లో మాస్ హిట్ పడాలంటే ఎన్టీఆర్ లానే కొరటాల శివతో సినిమాచేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ విషయంలో ఎన్టీఆర్ కూడా బన్నికి సాయం చేసినట్టు ఉన్నాడు.
తన వల్లే కొరటాల శివ తో బన్నీ ప్రాజెక్టు ఓకే అయ్యిందట. దేవర 2 తర్వాత వీళ్ల కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకెళ్లబోతోందట. ఇదే కాకుండా ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 తర్వాత బన్నీతో సినిమాచేసేందుకు రెడీ అయ్యాడు. ఆ ప్రాజెక్ట్ కి కూడా పరోక్షంగా ఎన్టీఆరే కారనం. వార్ 2 తర్వాత డ్రాగన్, దేవర 2 ఇలా వరుసగా సినిమా లు కమిటైన ఎన్టీఆర్, కొరటాల శివ చెప్పిన మరో కథని, బన్నీకి బదలాయించాడట. అచ్చంగా తను చేయాల్సిన బుచ్చిబాబు మూవీని చరణ్ కి ఇచ్చేసినట్టు… ఇది ఆల్ మోస్ట్ ఇండిస్ట్రీ వరకైతే అఫీషియల్, కాని అఫీషియల్ గా మాత్రం ఎనౌన్స్ చేయలేదు.