నెం.11 తో ఐకాన్ స్టార్ కి దరిద్రం.. ఆ నెంబర్ వింటే వణుకే..
ఇంటి నెంబర్ 13 అంటే హర్రర్ మూవీలు చూసేవాల్లకు వణుకొస్తుంది... అలా అల్లు అర్జున్ కి కూడా ఓ నెంబర్ వణుకు తెప్పిస్తోంది. అదే పదకొండు.. ఈ నెంబర్ విన్నా,చూసినా, ఆఖరికి గడియారంలో ముల్లు అక్కడ ఆగినా, బన్నీ భయపడాల్సి వస్తోందట. ఆ నెంబర్ తోనే అల్లు అర్జున్ కి దరిద్రం పట్టిందంటున్నారు.
ఇంటి నెంబర్ 13 అంటే హర్రర్ మూవీలు చూసేవాల్లకు వణుకొస్తుంది… అలా అల్లు అర్జున్ కి కూడా ఓ నెంబర్ వణుకు తెప్పిస్తోంది. అదే పదకొండు.. ఈ నెంబర్ విన్నా,చూసినా, ఆఖరికి గడియారంలో ముల్లు అక్కడ ఆగినా, బన్నీ భయపడాల్సి వస్తోందట. ఆ నెంబర్ తోనే అల్లు అర్జున్ కి దరిద్రం పట్టిందంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ నంధ్యాల వెల్లింది మే 11నే అవటం…
అలానే సంధ్య థియేటర్ లో ఆ సంఘటన 11 గంటలకే జరగటం.. దీనికి తోడు ఈ మొత్తం కేసులో ఐకాన్ స్టార్ ని అక్యూస్డ్ 11 గా చేర్చటం చూస్తుంటే, ఆనెంబర్ నిజంగానే బన్నీకి అచ్చిరాలేదేమో అనుకుంటున్నారు. ఒక వైపు 1600 కోట్ల వసూళ్లు తో రికార్డులు వస్తున్నాయంటున్నారు. మరోవైపు బాలీవుడ్ లో 700 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమా అనేశారు. ఇలాంటి టైంలో 11 నెంబర్ బన్నీని ఇరిటేట్ చేస్తోందంటే ఏంటర్ధం…? ఇది నిజం కాబట్టే జనవరి 11న ఓటీటీ రిలీజ్ అనుకున్న పుష్ప 2 డేట్ మారుతోందా? ఇది నిజంగా నిజమేనా?
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ హిట్టైందని సంతోషపడాలా? లేదంటే ఆ వసూళ్ల లెక్కల్లో నిజాలెంత అన్న కామెంట్లకు ఆన్సర్ ఇవ్వాలా… కాదంటే సంధ్యా థియేటర్ లో ఒక మహిళ మరణానికి పరోక్ష కారణంగా కేసులోఇరుక్కున్నందుకు బాధపడాలా..? ఈ డౌట్లకంటే పెద్ద మ్యాటర్ గా మారింది నెంబర్ 11… ఈ నెంబర్ అంటేనే బన్నీకి భయం, వణుకు, కంగారు పెరగుతోందా? ఇది నిజంగానే సెంటిమెంటల్ నెంబర్ అంటున్నారా? లాంటి డౌట్లు తేలాలంటే, అసలు ఇలాంటి సెంటిమెట్లు బన్నీకి ఉన్నాయో లేదో తేలాలి…
ఐతే సినీ ఇండస్ట్రీ లాంటి ఫీల్డ్స్ లో రాత్రికి రాత్రే హీరోలు స్టార్లైపోతారు. అలా ఒక హిట్ వాళ్ల తలరాతనే మార్చేస్తుంది.. ఓవర్ నైట్లో ఒక్క ఫ్లాప్ కూడా వాళ్లని పాతాళంలోకి తొక్కే ఛాన్స్ ఉంది. ఈ రెండీంటికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండనే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు. అలాంటి ఎడ్జ్ లోనే బన్నీ ఉన్నాడని కూడా అంటున్నారు. సింగిల్ సెంటిమెంట్ తనని ఇప్పుడు భయపెడుతోందనేస్తున్నారు.
లైఫ్ మార్చే ఫీల్డ్ కాబట్టి, అక్కడ ఇన్ సెక్యూరిటీస్ కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టే క్లారిటీ ఉన్న వాళ్లు కూడా కొన్ని సార్లు సెంటిమెంట్స్ ని నమ్ముతారు. అందులో భాగంగానే ఇప్పుడు బన్నీ 11 వ నెంబర్ కి భయపడుతున్నట్టున్నాడు.. ఎందుకంటే మే 11నే జనసేనకు వ్యతిరేకంగా నంధ్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థి కమ్ ఫ్రెండ్ కి ప్రచారం చేశాడు.
కట్ చేస్తే సంధ్యా థియేటర్ లో రాత్రి 11 గంటలకే ఆ ఇన్స్ డెంట్ జరిగింది. ఇక ఉదయం 11 గంటలకే అసెంబ్లీలో సీఎం వివరణ.. తర్వాత 11 గంటలకే పోలీసుల విచారణ.. ఇలా 11 గంటలు, 11 రోజులు, 11 నిమిషాలు ఇలా ఆ నెంబర్ ఏరూపంలో వినిపించినా కనిపించినా బన్నీకి పంచ్ పడుతోంది. అందుకే ఆ నెంబర్ తనకి మోస్ట్ అన్ లక్కీ నెంబర్ మాత్రమే కాదు, అదో దరిద్రపు గొట్టు సంఖ్యగా మారిందంటున్నారు.
బేసిగ్గా యూరప్ కల్చర్ లో భాగంగా అక్కడి వాళ్లు 13 నెంబర్ అంటే వణికిపోతారు. ఆనెంబర్ లేని ఇళ్లు, ఆనెంబర్ వాడని బోర్డులే ఇష్టపడతారు.. అంతగా ఆ నెంబర్ వాళ్లని భయపెట్టడానికి వాళ్ల కల్చరల్ కారణాలు వాళ్లకున్నాయి. ఇప్పుడు 11 నెంబర్ బన్నీకి అలానే మారినట్టుంది. అందుకే జనవరి 9 కి కాదని 11 కి ఓటీటీలో పుష్ప2 ని రిలీజ్ అనుకున్న టీం, మళ్లీ కాదని 15 కి వాయిదా వేస్తోందట. అంటే జనవరి 11 కి పుష్ప2 ఓటీటీ రిలీజ్ ని వారం క్రితమే ప్లాన్ చేసినా, ఈ వారం లోపు జరిగిన సంఘటనలతో సీన్ మారింది. ఆనెంబర్ మీద భయంతో వాయిదాకే పుష్ప2 టీం ఫిక్స్ అయ్యింది.