Chandramukhi-2 : చంద్రముఖి-2 ఫ్లాప్ తో దిక్కుతోచని కంగనా..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ సౌత్‌లో సెటిలవ్వాలనుకుంటే.. ఇక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. హిందీలో వచ్చే అరకొర ఛాన్సులతో నెట్టుకురావడం కష్టంగా వుండడంతో.. సౌత్‌పై ముఖ్యంగా తమిళంపై ఫోకస్ పెట్టిన కంగన ఆశలపై చంద్రముఖి ఫ్లాప్ నీళ్లు చల్లినట్టయింది. కంగన రనౌత్ హిందీలో అడుగుపెట్టిన రెండేళ్లకే.. ఐదో సినిమా 'ధూమ్ థాం'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. పోకిరి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా.. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక బ్లాక్‌బస్టర్‌ను వదలుకున్న కంగనకు..

If Bollywood fire brand Kangana Ranaut wants to settle down in South she has faced setbacks here as well Chandramukhi flopped on Kanganas hopes of focusing on South especially Tamil as it was difficult to push with few chances coming in Hindi
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ సౌత్‌లో సెటిలవ్వాలనుకుంటే.. ఇక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. హిందీలో వచ్చే అరకొర ఛాన్సులతో నెట్టుకురావడం కష్టంగా వుండడంతో.. సౌత్‌పై ముఖ్యంగా తమిళంపై ఫోకస్ పెట్టిన కంగన ఆశలపై చంద్రముఖి ఫ్లాప్ నీళ్లు చల్లినట్టయింది. కంగన రనౌత్ హిందీలో అడుగుపెట్టిన రెండేళ్లకే.. ఐదో సినిమా ‘ధూమ్ థాం’తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. పోకిరి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా.. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక బ్లాక్‌బస్టర్‌ను వదలుకున్న కంగనకు.. పూరీ డైరెక్షన్‌లో ఏక్ నిరంజన్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ డెబ్యూ మూవీస్ ఫ్లాప్ కావడంతో.. సౌత్ ఇండస్ట్రీ ఈ అమ్మడివైపు ఇంట్రస్ట్ చూపలేదు. అయితే.. జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన ‘తలైవి’లో టైటిల్ రోల్ పోషించి తమిళ తంబీలకు దగ్గరైంది కంగన. తలైవి సూపర్‌హిట్ కాకపోయినా.. పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నకంగనకు తమిళ ఆఫర్స్ క్యూ కట్టకపోయినా.. చంద్రముఖి2లో అడిగి మరీ నటించింది. బ్లాక్‌బస్టర్ చంద్రముఖికి సీక్వెల్ కావడం.. అందులోనూ.. నిజమైన చంద్రముఖిగా కంగన కనిపించడంతో.. ఈ సీక్వెల్ భారీ అంచనాల నడుమ రిలీజైంది. అయితే బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయింది. కంగన ప్రస్తుతం హిందీలో నటిస్తున్న రెండు హిందీ సినిమాలు షూట్ పూర్తి చేసుకున్నాయి. నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ కాంట్రవర్సీ మూవీ ఎమర్జన్సీ నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. మరో మూవీ తేజస్ కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. సౌత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆఫర్స్ రావడం లేదు. కాంట్రవర్సీ ఇమేజ్ వున్నా.. కోలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ రెండు ఆఫర్స్ ఇచ్చినా.. కంగనాకు సక్సెస్ మాత్రం దక్కలేదు. సౌత్‌లో ఐదుసినిమాలు చేస్తే.. ఒక్కటీ హిట్ కాకపోవడంతో ఆ ఎఫెక్ట్ కెరీర్‌పై పడడంతో.. సౌత్ నుంచి ఛాన్సులు రావడం కష్టమే. మరి ఇందిరాగాంధీగా నటించిన ఎమర్జన్సీ అయినా హిట్ తీసుకొస్తే మరో నాలుగు ఆఫర్స్ వస్తాయి. లేదంటే.. ఈ డాషింగ్ భామ కెరీర్‌కు కష్టాలు తప్పవు.