విడాకులు తీసుకుంటే సెకండ్ హ్యాండ్ అయిపోతానా…

2021లో నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత సమంతాను సోషల్ మీడియాలో ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. సినిమా పరిశ్రమలో కూడా కొందరు ఆమెదే తప్పు అంటూ ప్రచారం చేసినట్టు వార్తలు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2024 | 01:15 PMLast Updated on: Nov 26, 2024 | 1:15 PM

If I Get Divorced Will I Become Second Hand

2021లో నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత సమంతాను సోషల్ మీడియాలో ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. సినిమా పరిశ్రమలో కూడా కొందరు ఆమెదే తప్పు అంటూ ప్రచారం చేసినట్టు వార్తలు వచ్చాయి. సమంతా మాత్రం వాటిపై ఫోకస్ చేయకుండా కెరీర్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ బాలీవుడ్ రేంజ్ కు వెళ్ళింది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీ అయిపోయింది. డైవర్స్ తర్వాత తాను ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నానో సమంతా సంచలన కామెంట్స్ చేసింది. పుష్ప ఐటం సాంగ్ తర్వాత ఆమెపై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఒక స్త్రీ డైవర్స్ తీసుకుని ముందుకు వెళ్తే దానికి చాలా అవమానాలు, అభ్యంతరకరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని…. “నాకు ‘సెకండ్ హ్యాండ్’, ‘జీవితం వృధా’ వంటి కామెంట్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.

వివాహం తర్వాత అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని సమాంతా ఆవేదన వ్యక్తం చేసింది. తాము పుట్టి పెరిగిన కుటుంబాలు కూడా అర్ధం చేసుకోవని పేర్కొంది. సమంత ఒక అవును, నేను విడాకులు తీసుకున్నా… కాని నా జీవితం అక్కడితో ఆగదు… కానీ నేను దాని గురించి ఒక మూలను కూర్చొని ఏడుస్తానని, మళ్లీ జీవించే ధైర్యం లేదని దీని అర్థం కాదు అంటూ చెప్పుకొచ్చింది. విడాకులేం తనను ఆపలేదని సమంతా క్లారిటీ ఇచ్చింది. ‘అవును, ఇది జరిగింది… నాకు తెలుసు… నేను దాన్ని దాచడానికి ప్రయత్నించడం లేదు. ఇంతే కానీ, నా జీవితం అక్కడితో ముగిసిపోతుందని కాదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇది ఎక్కడ ముగుస్తుందో అక్కడ మొదలవుతుంది. నేను ప్రస్తుతం చాలా చాలా సంతోషంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. నేను చాలా ఎత్తుకు ఎదిగా… చాలా కష్టపడి పని చేస్తున్నా…. నా లైఫ్ లో తర్వాతి స్టేజ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ కామెంట్స్ చేసింది సమంతా.

ఇక సమంతాతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నాలుగున ఈ వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో కేవలం 300 మంది అతిధులతో ప్లాన్ చేసారు. 8 గంటల పాటు హిందూ సాంప్రదాయంలో ఈ వివాహ వేడుక జరగనుంది. సమంతా నుంచి చైతూ విడిపోవడానికి శోభిత కారణం అనే వార్తలు వచ్చాయి. అయితే సమంతా మాత్రం వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సినిమాలపైనే ఆమె ఫోకస్ చేసింది. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయింది.