పవన్ కళ్యాణ్ తప్పులు చేస్తుంటే.. శిక్షలు మాత్రం ఆ దర్శకుడికా..? సుజీత్ చేసిన తప్పేంటి..?

ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే సింపుల్‌గా సూసైడల్ అంటెంప్ట్ చేసుకోవడమే. అదేంటి అంత మాట అనేసారు అనుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2025 | 12:49 PMLast Updated on: Mar 04, 2025 | 12:49 PM

If Pawan Kalyan Is Doing Mistakes The Punishments Are The Director What Is Sujeets Mistake

ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే సింపుల్‌గా సూసైడల్ అంటెంప్ట్ చేసుకోవడమే. అదేంటి అంత మాట అనేసారు అనుకోవచ్చు. కానీ ఇదే నిజం మరి. ఆయనతో సినిమా కమిట్ అయిన దర్శక నిర్మాతలను అడిగితే ఇదే సమాధానం వస్తుంది. చెప్పడానికి వాళ్లు మొహమాటపడతారేమో కానీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా అయితే ఉండదు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఉన్న బిజీ చేస్తుంటే అసలు సినిమాలు చూస్తాడా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేస్తాను అని చెప్పాడు కానీ ఇప్పట్లో అది పూర్తయ్యేలా కనిపించడం లేదు. దాంతో ఈయన్ని నమ్ముకున్న దర్శకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఇప్పటికే హరీష్ శంకర్, క్రిష్ మధ్యలో వేరే సినిమాలు చేసుకున్నారు. సుజీత్ కూడా నానికి కథ చెప్పి రెడీగా ఉన్నాడు. తర్వాతి సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఓజి పూర్తైన తర్వాతే నాని సినిమా చేస్తానంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఓజి ఆల్రెడీ 70 శాతం అయిపోయింది. మరో 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమాను విడుదల చేస్తాడు సుజీత్. అందుకే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. సుజీత్ మాత్రం తన పని తను చేస్తున్నాడు. ఓజీ కోసం చాలా కాంప్రమైజ్ అవుతున్నాడు సుజిత్. ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయింది. మంగళగిరిలోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేయమని పవన్ కళ్యాణ్ చెప్తే దానికి కూడా ఓకే అన్నాడు సుజిత్. కానీ ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాలేదు.

పవన్ ఇప్పుడున్న బిజీలో రాష్ట్రం దాటడమే కష్టం అంటే దేశం దాటడం అనేది దాదాపు అసాధ్య. మరోవైపు సుజీత్ తో పెట్టుకుంటే లేట్ అయ్యేలా ఉంది అని వేరే దర్శకులతో సినిమాలకు కమిటయ్యాడు నాని. నిజానికి సరిపడా శనివారం తర్వాత సుజిత్ లైన్ లో ఉన్నాడు కానీ.. ఆయన సినిమా ఆలస్యమవుతుందని తెలిసి హిట్ 3 లైన్ లోకి వచ్చింది.. దీని తర్వాత పారడైజ్ ఉంది.. ఆ తర్వాత తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి తో మరో సినిమా కమిటయ్యాడు నాని. ఈ లెక్కన సుదీప్ ఓజీ కంప్లీట్ చేసే టైంకు.. నాని మూడు నాలుగు సినిమాలు కంప్లీట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఏదేమైనా పవన్ చేస్తున్న ఆలస్యానికి శిక్షలు మాత్రం సుజిత్ కే పడుతున్నాయి.