దేవరలో ఆ ఒక్క షాట్ ప్రభాస్ కు పడుంటే, బాక్సాఫీస్ కు అణుబాంబు పెట్టినట్టే

దేవరపై నెగటివ్ టాక్ తో సినిమాలో కొన్ని సీన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు. వాళ్లకు కూడా సినిమా ఓకే ఓకేగా అనిపించింది అని చెప్పడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 06:38 PMLast Updated on: Oct 01, 2024 | 6:38 PM

If That One Shot In Devara Falls To Prabhas

దేవరపై నెగటివ్ టాక్ తో సినిమాలో కొన్ని సీన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు. వాళ్లకు కూడా సినిమా ఓకే ఓకేగా అనిపించింది అని చెప్పడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. పక్కా మాస్ బొమ్మ అనే అవగాహన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా లేకపోవడం, నెగటివ్ ప్రచారం మాయలో వాళ్ళు కూడా పడిపోవడం దేవరకు పెద్ద దెబ్బ అయింది అనే మాట వాస్తవం. దేవర సినిమా విషయంలో రెండేళ్ళ నుంచి ఎన్టీఆర్, కొరటాల తీవ్రంగా కష్టపడటం, సినిమాలో వీళ్ళు ఆశించిన విధంగా కొన్ని సీన్స్ లేకపోవడంతో సినిమాపై నెగటివ్ బాగా ప్రచారం చేసారు.

కాని దేవర సినిమాను నూటికి నూరు శాతం కాపాడింది మాత్రం… పక్కాగా మౌత్ టాక్. సినిమా బాగాలేదని ఎవరు చెప్పారు మీకు…? అనే ఒక్క మాట సినిమాను పక్కాగా బ్రతికించింది అనే చెప్పాలి. యాక్షన్ సీన్స్ దేవరకు బాగా కలిసి వచ్చాయి. హిందీలో కూడా ఆ సీన్స్ కి అక్కడి మాస్ జనాలు పండగ చేసుకున్నారు అనే మాట వాస్తవం. ఇక సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా చాలా బాగా నచ్చింది జనాలకు. అండర్ వాటర్ ఫైట్ సీన్ తో పాటుగా ప్రతీ ఒక్కటి జనాలకు నచ్చేసాయి అనే మాట వాస్తవం. పాటల్లో కూడా నెగటివ్ గా ఏం కనపడలేదు.

ఇది పక్కన పెడితే ఒక్క షాట్ దేవరలో ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. అదే కంటైనర్ లోడ్ ని దేవర సముద్రంలోకి తోసుకుంటూ వెళ్ళడం. దేవర మాట కాదని భైరా, అతని మనుషులు సముద్రంలోకి వెళ్లి కంటైనర్ తీసుకొస్తే… అందులో ఏం ఉందో చెప్పాలని మురుగని ఎన్టీఆర్ అడుగుతాడు. దానికి మురుగ చెప్పడంతో… కంటైనర్ మొత్తాన్ని సముద్రంలోకి నెట్టేస్తాడు. ఈ సమయంలో భైరా మనుషులు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఎన్టీఆర్ మాత్రం ఆపడు. ఈ సీన్ గనుక ప్రభాస్ కు పడి ఉంటే కచ్చితంగా బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా అంటున్నారు సినిమా జనాలు.