100 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తే 172 కోట్ల ఓపెనింగ్స్… వీకెండ్ కి 300 కోట్లు…
దేవర దుమ్ముదులుపుతున్నాడు. ఎన్టీఆర్ ని ఏ డైరెక్టరైనా వాడుకుంటే, తాను బాక్సాఫీస్ తో బంతాట ఆడుకుంటాడన్న హీరో రామ్ మాట నిజమైంది. దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ వందకోట్లు ఉండొచ్చని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు.
దేవర దుమ్ముదులుపుతున్నాడు. ఎన్టీఆర్ ని ఏ డైరెక్టరైనా వాడుకుంటే, తాను బాక్సాఫీస్ తో బంతాట ఆడుకుంటాడన్న హీరో రామ్ మాట నిజమైంది. దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ వందకోట్లు ఉండొచ్చని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కాని ఆ వందకు మరో వంద ఆల్ మోస్ట్ జతఅయ్యింది. ఏకంగా 172 కోట్ల భారీ ఓపెనింగ్స్ తో దేవర ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ లో కలెక్షన్ల కత్తులు తిప్పుతున్నాడు. ఎంత మంది పాటలని కామెంట్ చేశారు.. ఇంకెంత మంది ట్రైలర ని ట్రోల్ చేశారు.. ఇన్ని కుట్రలు, ఇంకెన్ని కుళ్లు మాటలు.. ఇవేవి దేవరని వెనక్కి నెట్టలేకపోయాయి. రివ్యూల్లో కూడా రివర్స్ స్వింగులు పెరిగాయి. కాని ఏమైంది. కల్కీ రేంజ్ లోనే దేవరకి భారీగా వసూళ్ల వరదొచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ కి సౌత్ లోక్రేజ్ ఉండటం కామనే. కాని నార్త్ ఇండియాలో తనకు పెరిగిన క్రేజ్ కి దేవరే నిదర్శనంగా మారింది. ఇంకా వసూళ్లతో ఎక్కడెక్కడ ఇలాంటీ వింతలు క్రియేట్ అయ్యాయో చూసేయండి.
దేవర వసూళ్లు నిజంగా ఫ్యాన్స్ లోపూనకాలు తెప్పిస్తున్నాయి. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల వసూల్లన్నారు కాని, లెక్కతీస్తే 172 కోట్లని తేలుతోంది. కేవలం తెలంగాణలోనే ఈ మూవీకి 19. 32 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ఇంచుమించుగా 20 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే..
దేవర మూవీలో అండర్ వాటర్ ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ కూడా బాహుబలి రేంజ్ లో ఉందన్న మాటలే, బాహుబలిలా ఉన్నాయనే కామెంట్స్ కి కౌంటర్ గా మారాయి. ఏదేమైనా ఓ సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూలు, రియాక్షన్లు కామన్… వాటి తర్వాత వసూళ్లు పెరగటమో తగ్గటమో కూడా కామన్…
ఐతే ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంది, ఎంత మార్కెట్ ఉందనటానికి దేవర ఓ శాంపిల్ గా మారింది. రాజమౌళి లాంటి డైరెక్టర్ తీసిన సినిమా కాబట్టి త్రిబుల్ ఆర్ కి 1200 కోట్లు వస్తే, అటు చరణ్, ఇటు రాజమౌళి, తో కలిసి ఆ క్రెడిట్ షేర్ చేసుకున్నాడు తారక్.
కాని దేవర సోలో హీరోగా వచ్చాడు. కాబట్టే దేవరకి వచ్చిన ఓపెనింగ్స్ తో ఖాన్లు, కపూర్లని వెనక్కి నెట్టి, రెబల్ స్టార్ రేంజ్ లోసోలోగా పాన్ ఇండియా మార్కెట్ లో దూసుకెళుతున్నాడు. ఇక యూఎస్ లో అయితే మొదటి రోజు 3. 5 మిలియన్ డాలర్ల వసూళ్లొచ్చాయి. అంటే దాదాపు 28 కోట్లు.. ఇక ప్రివ్యూకి. 2.8 మిలియన్ డాలర్లు. అంటే అదో 22 కోట్లు అదనం… మొత్తంగా ప్రివ్యూ, ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలిపితే యూఎస్ లో 40 కోట్లు వచ్చినట్టే.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు లెక్కేస్తే మొదటి రోజు 55 కోట్లని తెలుస్తోంది. నైజాం 19.32 కోట్లు, వైజాగ్ లో 5.47 కోట్లు…గుంటూరు 6.27 కోట్లు ఇక నెల్లూరు , కృష్ణా కలిపి 5. 5 కోట్లు ఓపెనింగ్స్ వచ్చాయి. తూర్పు గోదావరిలో 4 కోట్ల 2 లక్షలు, పశ్చిమ గోదావరి 3.6 కోట్లు కలెక్ట్ అయ్యాియ. రాయలసీమ లో 10 కోట్ల ఓపెనింగ్స్ వసూళయ్యా
విచిత్రం ఏంటంటే అంతా ప్రిడిక్ట్ చేసినట్టే నార్త్ ఇండియా బెల్ట్ లో 30 కోట్ల గ్రాస్ వసూళ్లు, అందులో 7 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది నిజంగా ఓ తెలుగు స్టార్ కి అది సోలోగా చేసిన మూవీకి వచ్చిన ఓపెనింగ్స్ అంటే, హిందీ బెల్ట్ కూడా షాక్ అవుతోంది. ఓవరాల్ గా 100 కోట్ల ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్చేస్తే, ఏకంగా 172 కోట్ల వసూల్లు వచ్చాయంటే ఇది పాన్ ఇండియా మార్కెట్ లోనే ప్రభాస్ మూవీల తర్వాత క్రియేట్ అయిన రికార్డు. ఇక ఈ లెక్కలు ఇలాగే కొనసాగితే, కేవలం గురు, శుక్ర, శని, ఆదివారాల వసూళ్లతోనే 300 నుంచి 350 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ఉంది. సో నాలుగైదు రోజుల వసూళ్లతోనే మొత్తం పెట్టుబడిని రాబడితే, ఇది కల్కీ ని మించిన వేగంతో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మారే అవకాశం ఉంది.