నోరు విప్పితే… 1000 కోట్ల జరిమానా… మస్త్ వార్నింగ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి, ఆ వీడియోని వైరల్ చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబు నుంచి ఫోన్ కూడా లాగేసుకుంటున్నాడు. ఆల్రెడీ తన డేట్లు లాగేసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి, ఆ వీడియోని వైరల్ చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబు నుంచి ఫోన్ కూడా లాగేసుకుంటున్నాడు. ఆల్రెడీ తన డేట్లు లాగేసుకున్నాడు. ఇవన్నీ లాగేసుకుని తనకి ఇప్పుడు 1000 కోట్ల వార్నింగ్ కూడా ఇచ్చాడు. అదేదో 1000 కోట్ల రెమ్యునరేషనో, లేదంటే ఇంకేమో ఇస్తున్నాడంటే ఏమో అనుకోవాచ్చు.. కాని చాలా కాస్ట్ లీ వార్నింగ్ ఇచ్చాడు రాజమౌళి. ఎట్టి పరిస్థితుల్లో తన 1000 కోట్ల పాన్ వరల్డ్ మూవీ, అంశాలు లీక్ కాకూడదు… కేవలం స్టోరీ గురించే కాదు, హీరో, హీరోయిన్ తో పాటు, వాళ్ల లుక్స్ ని కూడా జనాలకు చూపించకూడదు. ఈ సినిమా తాలూకు స్టార్ కాస్ట్ అండ్ క్రూ తో పాటు, మరే ఇతర విషయాలు ఎవరితో పంచుకోకూడదు.. అలా కాకుండా,ఎవరైనా ఏదైనా అంశాన్ని ఎక్కడైనా లీక్ చేసినా, కనీసం బంధువులతో అయినా సినిమా అంశాలు పంచుకున్నా, తీవ్ర పరినామాలుంటాయి… కనీసం 1000 కోట్ల జరిమానా కూడా ఉండొచ్చు… బేసిగ్గా ఇలాంటి వార్నింగ్స్ స్టార్ హీరోలకు చెప్పడమే కష్టం. అలాంటిది ఏకంగా మహేశ్ బాబుతో అలాంటి అగ్రిమెంట్ మీద సైన్ చేయించాడు రాజమౌళి… ఈ మాస్ వార్నింగ్ వెనక ఇంకా చాలా పెద్ద లిటికేషన్స్ ఉన్నట్టున్నాయి. ప్రియాంక చోప్ర కూడా కంగారుపడే పరిస్థితొచ్చింది.. ఇంతకి ఆ అగ్రిమెంట్ వెనకున్న మెలికలేంటి… అంతగా రాజమౌళి ఎందుకు 1000 కోట్ల మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు? హావేలుక్.
రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు , బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కలిసి చేస్తున్న సినిమా టైటిల్ గోల్డా, మహారాజా ఏదైనా కావొచ్చు. కాని ఈ మూవీ వారినికోరకంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా తాలూకు సింగిల్ మ్యాటర్ లికైనా, వెయ్యికోట్ల జరిమానా అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు రాజమౌళి. మొన్నటి వరకు తన సినిమా షూటింగ్ లో హీరోలు ఫోన్లు వాడనిచ్చేవాడు కాదు. తెలియని వాళ్లని లేదంటే మరో మూవీ హీరోలని అంత ఈజీగా సెట్లోకి ఆహ్వానించే వాడు కాదు.
ఇప్పడు తన డైరెక్షన్ లోసినిమా చేస్తున్న మహేశ్ బాబుని కూడా సెట్లోకి రానివ్వనటంటున్నాడు. ఈ మూవీని సైన్ చేసిన ప్రియాంక చోప్రకి కూడా నో ఎంట్రీ అనేస్తున్నాడు. సినిమాలో తీసుకుని సెట్ కి రాకూడదంటే అర్ధం లేదు. కాని అక్కడ సెట్లో ఉంది రాజమౌలి. పాన్ ఇండియ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు.. కాబట్టి తనేమైనా అంటాడు… స్టార్స్ ఏదైనా విని ఊకొడతారు.. ఇప్పుడు అదే జరుగుతోంది
తనతో సినిమా చేయాలంటే, సెట్లోకి సైడ్ యాక్టర్లు, టెక్నీషియన్సే కాదు, హీరో మహేశ్ బాబుకి కూడా కండీషన్స్ అప్లై అంటున్నాడు. మొన్న తన పాస్ పోర్ట్ లాగేసుకున్నాడు. ఇప్పుడు సెల్ ఫోన్ లాగేసుకుంటున్నాడు. సెట్లోకి అడుగుపెట్టే నటులైనా, టెక్నీషియన్స్ అయినా లాకర్ రూమ్ లో సెట్ ఫోన్ ని స్విచ్చాఫ్ చేసి పెట్టాలి… సెట్లోకి సెల్ ఫోన్ అలో చేయరట
ఇది మగధీర టైం నుంచి ఫాలో అవుతున్న కండీషనే.. కాని ఇప్పుడు లీకేజీల భయం ఎక్కువయ్యి, ఏకంగా లికులు జరక్కుండా చూసుకుంటానంటూ అగ్రిమెంట్ రాయిస్తున్నాడు. కేవలం టెక్నీషియన్స్, సైడ్ యాక్టర్లే కాదు, హీరో, హీరోయిన్లు కూడా ఈ నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సిందే. అలా చేస్తే సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఎవరితో పంచుకోకూడదు. స్టార్స్ కూడా వాల్లు లుక్స్ ని, రివీల్ చేయకూడదు. ఒకవేల ఎవరైనా ఈ రూల్స్ ని అతిక్రమిస్తే, 1000 కోట్ల బడ్జెట్ లో10 నుంచి 90శాతం అంటే ఆల్ మోస్ట్ వెయ్యికోట్ల వరకు జరిమానాలుండొచ్చు..
ఈవిషయంలో దర్శక నిర్మాతలకు కూడా ఎగ్జెమ్షన్ ఉండదు… వాల్లు కూడా సైన్ చేయాల్సిందే. అందుకే ఫస్ట్ టైం తన సినిమా టైటిల్ గోల్డా, మహారాజా ఇలా ఏదో తేలలేదు. ఇక స్టార్ కాస్ట్ లో మహేశ్, ప్రియాంక పాత్రలు తప్ప మరేది రివీల్ కాలేదు. అసలే రాజమౌళి తో సినిమా అంటే హీరో, హీరోయిన్లు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు సెట్స్ కే పరిమితమవ్వాలి… కనీసం సింగిల్ అప్ డేట్ కూడా ఇవ్వడు జక్కన్న. కనీసం అప్పుడప్పుడొచ్చే లీకులతో అయినా ఫ్యాన్స్ సంబరపడిపోతారంటే అది కూడాలేకుండా చేస్తున్నాడు రాజమౌళి.