Devara : ‘దేవర’ రెండు వారాలు ముందుకి
ఓపెనింగ్ రోజు మృగాల వేట.. గ్లింప్స్‌లో బ్లడ్ మూన్ షాట్, ఎరుపెక్కిన సముద్రం.. ఫస్ట్ సాంగ్‌తో దేవర ముంగిట నువ్వెంత అంటూ.. కొరటాల శివ దేవర (Devara) సినిమాకు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు.

If you see Devara's hype on social media.. sometimes it seems that fans go away with that hype.
ఓపెనింగ్ రోజు మృగాల వేట.. గ్లింప్స్‌లో బ్లడ్ మూన్ షాట్, ఎరుపెక్కిన సముద్రం.. ఫస్ట్ సాంగ్‌తో దేవర ముంగిట నువ్వెంత అంటూ.. కొరటాల శివ దేవర (Devara) సినిమాకు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ఇదే జోష్‌లో రెండు వారాలు ముందుకి సినిమాను తీసుకొస్తున్నాడు.
సోషల్ మీడియా (Social Media) లో దేవర హైప్ చూస్తే.. ఒక్కోసారి ఆ హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా ఉన్నట్టునిపిస్తుంది. కొరటాల బాక్సాఫీస్‌ను ఎరుపెక్కించడానికి వస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాను ఎరుపెక్కిస్తునే ఉన్నారు. ఈ సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్‌ను వైరల్ చేస్తునే ఉన్నారు. మేకర్స్ కూడా టైగర్ ఫ్యాన్స్ ఎక్కడా తగ్గకుండా సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఊహించని బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాస్తవానికైతే.. ఏప్రిల్ 5నే దేవర రావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే అవడంతో.. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేశారు. అయితే.. ఇప్పుడు మరోసారి దేవర డేట్ మారింది. గత కొద్ది రోజులుగా దేవర ప్రీపోన్ అవుతున్నట్టుగా వార్తలు వస్తుండగా.. ఇప్పుడు దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్.
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెబుతూ.. దేవర సెప్టెంబర్ 27న రానుందని సాలిడ్ పోస్టర్‌తో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా.. దేవర ముందస్తు రాక గురించి అన్ని తీర ప్రాంతాలకు హెచ్చరిక నోటీసు పంపుతున్నామని.. రాసుకొచ్చారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ చేస్తున్న ఓజి సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని.. మొన్నటి వరకు బల్లగుద్ది మరీ చెబుతూ వచ్చారు మేకర్స్. కానీ ఇప్పట్లో ఓజి కష్టమేనని దేవర కొత్త డేట్‌తో క్లారిటీ ఇచ్చేశారు. మరి ఓజి రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.