1000 కోట్లు కావాలంటే జనాల్లోకి .. ఎన్టీఆర్, చరణ్, బన్నీ దారిలో..

దేవర రిలీజ్ కి ముందు ప్రమోషన్ కోసం, ముంబై, బెంగులూరు, హైద్రబాద్, నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు చక్కర్లు కొట్టాడు ఎన్టీఆర్. అలా ఈ సినిమా రిలీజ్ కి ముందు పాన్ ఇండియా మొత్తం ప్రచారం చేశాడు. కట్ చేస్తే సౌత్ ని మించేలా వసూల్లు నార్త్ నుంచే భారీగా వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 06:49 PMLast Updated on: Dec 20, 2024 | 6:49 PM

If You Want 1000 Crores Go To The People Ntr Charan Bunny Are On The Way

దేవర రిలీజ్ కి ముందు ప్రమోషన్ కోసం, ముంబై, బెంగులూరు, హైద్రబాద్, నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు చక్కర్లు కొట్టాడు ఎన్టీఆర్. అలా ఈ సినిమా రిలీజ్ కి ముందు పాన్ ఇండియా మొత్తం ప్రచారం చేశాడు. కట్ చేస్తే సౌత్ ని మించేలా వసూల్లు నార్త్ నుంచే భారీగా వచ్చాయి. బాక్సాఫీస్ లో కలెక్షన్ల రీసౌండ్స్ షాక్ ఇచ్చాయి.. తర్వాత పుష్ప రాజ్ వంతొచ్చింది. తను బీహార్ నుంచి ప్రచారం ,చేస్తే కలెక్సన్లు లక్నో వైరకు రీసౌండ్ చేస్తున్నాయి. అలా బాక్సాఫీస్ లో వసూళ్ల వరదను క్రియేట్ చేశాడు. ఇక ప్రభాస్ లాంటి కటౌట్ బయటికి రాకున్న బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అయినా కల్కీ టైంలో రెబల్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ ని రౌండప్ చేశాడు. చరణ్ కూడా కేవలం టీజర్ కోసం నార్త్ ఇండియాలో గ్రాండ్ ఈవెంట్ తో ఎగ్జాంపుల్ సెట్ చేశాడు.. సో బాలీవుడ్ స్టార్లకు కూడా వెయ్యికోట్ల వసూళ్లు కావాలంటే, ఇక మీదట ఇంట్లో కూర్చుని ప్రచారం చేస్తే కుదరదు… వొళ్లొంచాలి? బద్దకాన్నే కాదు, చాలా విషయాలు పక్కన పెట్టి ప్రజల వద్దకు పాలన అంటూ బయలుదేరాలి… ఈ ఏడాది టాలీవుడ్ స్టార్స్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారా?

కల్కీ టైంలో ప్రభాస్ ప్రమోషన్ కి టైం లేక పెద్దగా ప్రచారం చేయలేదు కాని, రిలీజ్ తర్వాత మాత్రం పాన్ ఇండియా మొత్తం ఓ రౌండ్ వేశాడు. తర్వాత వచ్చిన దేవర కోసం ఎన్టీఆర్ అయితే రెండు నెలలు కేవలం సినిమా ప్రమోషన్ కే కేటాయించాడు. బెంగులూరు, ముంబై, కేరళా, చెన్నై, హైద్రబాద్,యూఎస్, ఇలా దేవరని అంతటా ప్రచారం చేశాడు. హిందీ యూ ట్యూబ్ ఛానెల్లు, పాడ్ కాస్ట్ లు, కపిల్ శర్మ షోలు ఇలా దేవర మూవీని ప్రచారం చేయటం కోసం ఎన్టీఆర్ చేయని పనిలేదు.

ఫలితంగా 510 నుంచి 670 కోట్ల వరకు పాన్ ఇండియా లెవల్లో వసూళ్ళు రాబట్టింది ఈ సినిమా. ఇక నార్త్ ఇండియాలో అయితే 350 కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది. కాని హిందీ మూవీలేవి ఆరేంజ్ లో నార్త్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయలేకపోయాయి.

ఇక కల్కీ 1200 కోట్లు రాబడితే, పుష్ప2 మూవీ 1500 కోట్ల క్లబ్ లో చేరిందంటున్నారు. పుష్ప2 టాక్ సౌత్ లో వీకున్నా, నార్త్ లో మాత్రం వసూళ్లొస్తున్నాయి. ఇక్కడ వసూళ్లు, మంచి కంటెంట్ మాత్రమే టాపిక్ కాదు, ఆ కంటెంట్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లారనేదే హాట్ టాపిక్

పుష్ప2 ప్రమోషన్ కోసం బీహార్ వెళ్లాడు బన్నీ, గేమ్ ఛేంజర్ టీజర్ ని లక్నోలో లాంచ్ చేశాడు రామ్ చరణ్. ఇలా పాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్రమోట్ చేశారు కాబట్టే, ఆ కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది. కాబట్టి బాలీవుడ్ హీరోలు కూడా ఇలా వొళ్లొంచి కష్టపడితే కాని కాసులు రాలవు…ముంబైలో కూర్చుని ట్రైలర్ వదిలితే, జనాలు థియేటర్స్ కి వచ్చే పరిస్థితులే ఉండకపోవచ్చంటున్నారు. ఖాన్లైనా కపూర్లైనా, వాళ్ల సినిమాలు జనాల్లోకి వెళ్లాలంటే, వాళ్లుకూడా ప్రజల వద్దకే ప్రచారం అంటూ కదలాలి…

ఎక్కడో సౌత్ ఇండియా నుంచి నార్త్ లో ఏబాలీవుడ్ హీరో వెల్లని సిటీల్లోకి వెల్లి మరీ తెలుగు హీరోలవాళ్ల సినిమాలను ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటిది ముంబై హీరోలు ఇక ఆ సిటీకే పరిమితమైతే వాళ్లని నార్త్ ఆడియన్స్ పట్టించుకునే ఛాన్సే ఉండదు. అసలే కంటెంట్ లేని కథలతో బాలీవుడ్ సినిమాలు అడ్రస్ లేకుండాపోతున్నాయి. ఇప్పుడు సేల్స్ మెన్ లా ఊరూరు కాకున్నా కొన్ని రాష్ట్రాలైన తిరిగి వాళ్ల సినిమాలను ప్రచారం చేసుకోకపోతే, జనం పట్టించుకోవటమే మానేసే ప్రమాదం ఉంది. మొత్తంగా సౌత్ హీరోలు మరీ ముఖ్యంగా, తెలుగు స్టార్లు సాలిడ్ కథలతోనే కాదు, పర్ఫెక్ట్ ప్రచారంతో కూడా బాలీవుడ్ హీరోల కళ్లు తెరిపిస్తున్నారు..