Rajamouli, Mahesh Babu : మహేష్ కి జక్కన్న చుక్కలు చూపిస్తున్నాడా…?
టాలీవుడ్ (Tollywood) లో రాజమౌళి (Rajamouli) తో సినిమా చేయాలంటే మాత్రం ఒక మూడు నాలుగేళ్ళు మరో సినిమాపై అసలు ఆశలు పెట్టుకునే ఛాన్స్ లేదు.

If you want to make a film with Rajamouli in Tollywood, there is no chance to hope for another film for another three or four years.
టాలీవుడ్ (Tollywood) లో రాజమౌళి (Rajamouli) తో సినిమా చేయాలంటే మాత్రం ఒక మూడు నాలుగేళ్ళు మరో సినిమాపై అసలు ఆశలు పెట్టుకునే ఛాన్స్ లేదు. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయడు జక్కన్న (Jakkanna). తన సినిమా తాను అనుకున్నట్టు వచ్చే వరకు ఎవరి మాట వినే ప్రశ్న ఉండదు. బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సినిమాల్లో చాలా సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ షూట్ చేసాడు జక్కన్న. దీనితో హీరోలు కూడా విసిగిపోయిన పరిస్థితి.
Maharaja Ravi Teja : 56 ఏళ్ళ వయసులో రవితేజా రిస్క్…?
ఇక ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో సినిమా చేస్తున్నాడు ఈ దర్శక ధీరుడు. సినిమా విడుదల ఎప్పుడు అనేది తెలియదు గాని వచ్చే ఏడాది చివర్లో అని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలిసింది. అక్కడి వరకు బాగానే ఉంది గాని ఈ సినిమాలో సన్నివేశాల గురించి మహేష్ తో ఎక్కువ టైం గడిపి… ఈ సీన్ ఇలా రావాలి, అలా రావాలని వివరించడం, ఒకవేళ రాకపోతే మనం ఎన్ని సార్లు అయినా రీ షూట్ చేస్తామని చెప్పడం, ఇక బాడీ లాంగ్వేజ్ వాకింగ్ స్టైల్ కూడా కొంత భిన్నంగా ఉండాలని చెప్పడం వంటివి చేస్తున్నారట జక్కన్న.
Samantha, Nayan : డాక్టర్ సమంత.. డాక్టర్ నయన్.. మనకెందుకీ బోడి సలహాలు బ్యూటీస్..
అలాగే అడవుల్లో కుదిరితే ఎక్కువ టైం గడపమని, రన్నింగ్ వంటివి ఎక్కువ చేయమని మహేష్ కు చెప్తున్నారట. ఇక తన టీంని మహేష్ వద్దకు పంపి… కథలో చిన్న చిన్న మార్పులను కూడా మహేష్ కు ఎప్పటికప్పుడు చెప్తున్నారట. మహేష్ కు డాన్స్ విషయంలో కాస్త ఇబ్బంది ఉండటంతో ప్రముఖ డాన్స్ మాస్టర్ల సలహా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారట రాజమౌళి. ఈ సినిమాలో రెండు పాటలు అత్యంత కీలకమవుతాయని వాటి షూటింగ్ ని ముందు పూర్తి చేస్తానని కాబట్టి డాన్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పారట జక్కన్న. ఇవన్నీ చూస్తున్న మహేష్… గతంలో తాను ఎవరితో సినిమా చేసినా ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, జక్కన్న స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉందని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట మహేష్.