Ileana: తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసినా ఇలియానా..
పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్స్ లిస్ట్‌లో గోవా బ్యూటీ ఇలియానా కూడా రీసెంట్‌గా చేరిపోయింది. అప్పటి నుంచి ఇలియానా ఫ్యాన్స్ అంతా అడుగుతున్న క్వశ్చన్ ఒక్కటే.. ఆ బేబీకి తండ్రి ఎవరూ అని.
ఈ విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని ఇలియానా.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. రెస్టారెంట్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రశాంతంగా తిననివ్వకపోవడమే తనకు తెలిసిన రొమాన్స్ అంటూ పోస్ట్ పెట్టింది. ఫొటో చూసిన నెటిజన్లంతా ఇతనే ఇలియానా బాయ్‌ఫ్రెండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఇతడేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం తాను తల్లి కాబోతున్నానంటూ ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పెళ్లి కాకుండా తల్లి కాబోతున్నట్టు చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అప్పటి నుంచి ఆమె గర్భానికి కారణం ఎవరా అనే విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌ను రివీల్ చేయడంతో ఇతనే ఇలియానాకు పుట్టుబోయే బిడ్డకు తండ్రి అంటున్నారు. మరి నిజంగా అతనేనా కాదా అనే విషయం ఇలియానానే క్లారిటీ ఇవ్వాలి.