Ileana: ఇలియానా కొడుకును చూశారా..
గోవా బ్యూటీ ఇలియానా తల్లైంది. ఆగస్ట్ 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ గుడ్ న్యూస్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

Ileana posted on her social media platform that she gave birth to a baby boy
కోవా ఫీనిక్స్ డోలన్ అని తన కొడుక్కి పేరు పెట్టుకుంది ఇలియానా. తమ హృదయాలను దాటి తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది ఇలియానా. తాను తల్లి కాబోతున్నట్టు ఏప్రిల్‌లో చెప్పిన ఇలియానా తన గర్భానికి కారణం ఎవరు అన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో చాలా రోజులు సస్పెన్స్ క్రియేట్ చేసింది. పెళ్లి కాకుండా ఎలా తల్లి అయ్యిందంటూ ఇలియానా ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు.
చివరికి రీసెంట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ను రివీల్ చేసింది ఇలియానా. ప్రియుడితో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. కానీ అతని పేరు మాత్రం చెప్పలేదు. అప్పటి నుంచి రెగ్యులర్‌గా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో అప్‌డేట్స్ పంచుకునేది. ఇప్పుడు డైరెక్టర్‌గా తన బిడ్డ ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బాబు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.