Ileana: హమ్మయ్యా.. ప్రెగ్నెన్సీ సీక్రెట్‌ బయటపెట్టిన ఇలియానా..

ఇలియానా ప్రెగ్నెంట్ అని తెలుసు కానీ.. ఆ ప్రెగ్నెన్సీకి కారణం మాత్రం తెలియదు ఇప్పటివరకు. తాను గర్భవతిని అని ప్రకటించినప్పటి నుంచి.. ఏదైనా క్లూ దొరకపోదా అని ఇల్లీ బేబీ సోషల్‌ మీడియా ఖాతాలన్నీ జల్లెడ పట్టారు ఫ్యాన్స్‌ అంతా అయినా నో చాన్స్.. ప్రెగ్నెన్సీ సీక్రెట్ ఏంటో అసలే తెలియలేదు ఎవరికి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 17, 2023 | 01:46 PMLast Updated on: Jul 17, 2023 | 1:46 PM

Ileana Reveals Who Is The Reason For Her Pregnancy

ఐతే ఇన్నాళ్లకు ఇలియానానే ఆ రహస్యాన్ని బయటపెట్టింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా.. ఆ తర్వాత తమిళ్‌లోనూ సినిమాలు చేసింది. హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ప్రేమలో పడటం, బ్రేకప్ జరిగిపోవడం.. ఆ తర్వాత డిప్రషన్ లోకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో ఇలియానా చాలా లావుగా మారిపోయింది. తెలుగులో తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చేసింది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ సినిమాల్లో నటించలేదు ఇలియానా.

ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇలియానా సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌హాట్‌ ఫొటోలతో అభిమానులను ఖుష్ చేస్తుంటుంది. ఇలా వన్ ఫైన్ డే.. తాను ప్రగ్నెంట్ అని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది ఇలియానా. బేబీ బంప్‌తో ఫోటోలను షేర్ చేసింది. ప్రెగ్నెంట్ అని చెప్పింది కానీ.. ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అన్నది మాత్రం రహస్యంగానే ఉంచింది ఇలియానా. ఇంతవరకు తన బాయ్‌ఫ్రెండ్ ఎవరు అన్నది చెప్పనే లేదు. ఎవరా బాయ్‌ఫ్రెండ్ అని ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న వేళ.. తన బాయ్‌ఫ్రెండ్‌ను రివీల్ చేసింది ఇలియానా. ఫోటోలను షేర్ చేసింది. కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్‌లో ఉందని.. గతంలో వార్తలు వచ్చాయ్. ఐతే ఈ ఫొటోలో ఉన్నది మాత్రం సెబాస్టియన్ కాదు అని అంటున్నారు. మరి అతడి పేరు ఏంటో ఇలియానా ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి మరి.