నా మొగుడితో అది బాగా ఎంజాయ్ చేస్తున్నా.. రకుల్ ప్రీత్ సెన్సేషనల్ పోస్ట్

కొన్నాళ్ల క్రితం జిమ్ములో వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు రికవరీ అయింది. తన భర్త జాకీ తో కలిసి లండన్. పారిస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2025 | 04:24 PMLast Updated on: Jan 06, 2025 | 4:24 PM

Im Enjoying It With My Husband Rakul Preets Sensational Post

కొన్నాళ్ల క్రితం జిమ్ములో వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు రికవరీ అయింది. తన భర్త జాకీ తో కలిసి లండన్. పారిస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది. ఇక గాయం కారణంగా సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్న రకుల్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఇక తన హెల్త్ అప్డేట్స్ ఇస్తూ అనేక విషయాలపై తన ఒపీనియన్స్ షేర్ చేసుకుంటుంది. తాజాగా ఒక పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి బయట పెట్టింది.

అలాగే గాయం తర్వాత తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనే విషయాలను కూడా షేర్ చేసుకుంది. బరువు తగ్గే ప్రాసెస్ లో హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో క్యాలరీలు పెరగకుండా ఫేవరెట్ డిష్ లకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. తాను అలాంటి ఫీలింగ్ తోనే కన్ఫ్యూజ్ అయ్యానని, నచ్చిన ఫుడ్ తినాలనిపించిన ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను అని.. ఈ రెండు హాలిడేస్ కోసం ప్రస్తుతం పారిస్ వచ్చినట్టు తన పోస్టులో చెప్పుకొచ్చింది. ఈ హాలిడేలో అన్ని పక్కన పెట్టేసానని ఫుడ్ ఎంజాయ్ చేసే విషయంలో ఎప్పుడూ గిల్టీ ఫీలింగ్ ఉండేదని.. ట్రాక్ తప్పుతాననే ఒత్తిడితో తల తిరిగిపోయేదని తన ఎక్స్పీరియన్స్ బయటపెట్టింది.

మొత్తానికి న్యూ ఇయర్ లో ఆ ఫీలింగ్ వదిలేయడంతో చాలా హ్యాపీగా ఉన్నానని… ఒక్క క్షణం బతికినా సంతోషంగా బతకాలని చెప్పుకొచ్చింది. మీరు ఎలా కనిపిస్తున్నారు అనేదానికంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది ముఖ్యమని ఇతరుల ఒపీనియన్స్ తో పని లేకుండా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలని పోస్ట్ చేసింది. అందుకు ఇదే సరైన టైమని.. ఒత్తిడిని పక్కనపెట్టి జ్ఞాపకాలు అందించిన అనుభవాలతో 2025 లకు అడుగు పెట్టాలంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దాదాపుగా దూరమైనట్లుగానే ఉంది.

పెళ్లి తర్వాత పెద్దగా ఈమె గురించి న్యూస్ ఏమి రావడం లేదు. అటు బాలీవుడ్ లో అలాగే పంజాబీ సినిమాల్లో చాన్సుల కోసం ట్రై చేస్తోంది. ఈ మధ్య కొన్ని రాజకీయ వ్యవహారాల్లో కూడా ఈమె పేరు బయటకు వచ్చింది. అయితే వాటిపై కాస్త జాగ్రత్తగానే రియాక్ట్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం యూరప్ వెళ్ళిన ఈ అమ్మడు ఇప్పట్లో తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం కనబడటం లేదు. కంప్లీట్ గా రికవరీ అయిన తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తన హెల్త్ అంతా ఇప్పుడు కొంత సెట్ అయిపోయిందని కాకపోతే బరువు పెరగకుండా మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ఈ విషయంలో తన భర్త తనకు చాలా హెల్ప్ చేశాడు అంటూ చెప్పుకొచ్చింది.