Harish Shankar : హరీష్ నోట్లో నుంచి టాలీవుడ్ షేక్ అయ్యే మాట

2017 లో అనుకుంట... త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబోలో ఒక సినిమా వస్తుందని ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 30, 2024 | 12:30 PMLast Updated on: Jul 30, 2024 | 12:30 PM

In 2017 Anukunta Will Release A Film Directed By Trivikram In The Combo Of Chiranjeevi And Pawan Kalyan

2017 లో అనుకుంట… త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబోలో ఒక సినిమా వస్తుందని ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి (Subbirami Reddy) నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని ఆ సినిమా ఏమైందో… ఏమవుతుందో అనే దానిపై చాలానే చర్చలు జరిగాయి ఫాన్స్ లో.. ఇప్పటి వరకు ఈ రేంజ్ సినిమా మన టాలీవుడ్ (Tollywood) లో రాలేదు. అప్పట్లో దీనిపై కథ కూడా సిద్దమైందని, దానయ్య కూడా ఈ సినిమా మీద పవన్ ను చిరంజీవి ని ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలను చేసారని టాక్ గట్టిగానే వచ్చింది.

ఆ తర్వాత చిరంజీవి కి పవన్ కు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అందుకే ఈ సినిమాపై ఏ స్పష్టత రావడం లేదని కృష్ణా నగర్ (Krishna Nagar) వర్గాలు అన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాపై ఒక దర్శకుడు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమాతో కాస్త ఊపు మీదున్న హరీష్ శంకర్… ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫాన్స్ (Mega Fans) కు మంచి జోష్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. చిరు అండ్ పవన్ కోసం ఒక లైన్ రెడీ చేసాను అని… అందులో రామ్ చరణ్ (Ram Charan) కూడా ఉంటాడని చెప్పుకొచ్చాడు.

ఇది గనుక మొదలైతే మాత్రం పాన్ ఇండియా (Pan India) కన్నా అతిపెద్ద సినిమా అవుతుందని ఈ క్రేజీ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వంలో బిజీగా ఉండటంతో ఆలస్యమవుతుందని టాక్ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కావడంతో… రవితేజ (Ravi Teja) తో మిస్టర్ బచ్చన్ ను మొదలుపెట్టి పూర్తి చేసాడు. మరి ఉస్తాద్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా… హరీష్ అనుకున్న కాంబో గనుక వర్కౌట్ అయితే మాత్రం సినిమా రేంజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.