Bigg Boss season-7 : బిగ్ బాస్ సీజన్-7లో యావర్ కు శ్రీముఖి బంపర్ ఆఫర్..

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ ఎవరన్నదానిపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. ఫినాలేకి ఒక్కరోజు ముందు హౌస్‌మెట్స్ అందరికీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో హౌస్ దద్దరిల్లిపోయింది.. ఇక.. యాంకర్‌ శ్రీముఖి చేసిన సందడితో హౌస్‌ మొత్తం ఓ రేంజ్‌లో వైబ్రేట్ అయిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2023 | 11:00 AMLast Updated on: Dec 17, 2023 | 11:00 AM

In A Few Hours The Excitement Will Be Over Who Will Be The Winner Of Bigg Boss Season 7

 

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ ఎవరన్నదానిపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. ఫినాలేకి ఒక్కరోజు ముందు హౌస్‌మెట్స్ అందరికీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో హౌస్ దద్దరిల్లిపోయింది.. ఇక.. యాంకర్‌ శ్రీముఖి చేసిన సందడితో హౌస్‌ మొత్తం ఓ రేంజ్‌లో వైబ్రేట్ అయిపోయింది.

లాస్ట్ ఎపిసోడ్‌లో హౌస్‌మెట్స్‌ మస్త్ ఎంజాయ్ చేశారు. ఫన్నీ టాస్కులు, గేమ్స్‌తో సరదా సరదాగా గడిపారు. హౌస్‌లో జరిగిన కొన్ని ఐకానిక్ సన్నివేశాలను రీ క్రియేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్.. ఇందులో భాగంగా.. కంటెస్టెంట్లు ఇతర ఇంటి సభ్యులను ఇమిటేట్ చేయాల్సి ఉంటుంది. అమర్ పాత్రలో అర్జున్.. గౌతమ్‌లా అమర్ నటించారు. అటు.. అమర్‌లా శివాజీ ఇరగదీశాడు. ఇక చివరిలో ప్రియాంక.. శివాజీ కాఫీ గొడవని ఇమిటేట్ చేసి నవ్వులు పూయించింది.

ఇక తర్వాత యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే కంటెస్టంట్లకు టైట్‌ హగ్ ఇచ్చింది. తన ఎనర్జీతో హౌస్‌ మొత్తాన్ని దడదడలాడించేసింది. ప్రియాంకతో పాటల ప్రోగ్రాం పెట్టింది. ఆ తర్వాత ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడించారు. ఈ గేమ్స్ చాలా ఫన్నీగా సాగాయి యావర్ మీద మాత్రం శ్రీముఖి గట్టిగానే కాన్సట్రేషన్ పెట్టింది. ఇక వెళ్లేటప్పుడు అమ్మడు యావర్‌కు గట్టి సర్‌ప్రైజే ఇచ్చింది.. యావర్‌ను పిలిచి చేతిలో చేయి కలిపి.. రొమాంటిక్‌ సాంగ్ పాడింది.. ఐయామ్ 30 అండ్ సింగిల్.. నాట్ రెడీ టూ మింగిల్.. కానీ నీ గురించి ఆలోచిస్తా.. అంటూ కామెంట్‌ చేయడంతో.. యావర్ తెగ సిగ్గు పడిపోయాడు. తర్వాత బిగ్ బాస్ సూట్ కేట్ ఇచ్చాడు. అందులో మూడు లక్షలు ఉన్నాయని.. ఎవరికి కావాలో తేల్చుకోవాలని సూచించాడు. దీంతో ఇంటి సభ్యులు వద్దని చెప్పారు. ఆ తర్వాత మనీ ప్రైజ్ పెంచుకుంటూ వచ్చాడు బిగ్ బాస్. అయినప్పటికి ఇంటి సభ్యులు తీసుకోలేదు.

ఇక.. బయట హల్‌ చల్ చేస్తున్న లీకుల ప్రకారం యావర్ బ్రీఫ్‌కేస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక శివాజీ తెర వెనకాల కథ నడిపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్‌ల్ దీనిపై శివాజీ ముందుగానే హింట్ ఇచ్చాడు. నిన్నటి ఎపిసోడ్‌లో గార్డెన్ ఏరియాలో సోఫాలో కూర్చొని ఉన్నాడు శివాజీ. ఇక యావర్ అలా కింద పడుకొని శివాజీతో మాట్లాడాడు. సరిగ్గా అదే సమయంలో ఫినాలేలో ఎలాంటి ఛాన్స్ వదులుకోకు యావర్.. గుర్తుపెట్టుకో అర్థమైందా అంటూ యావర్‌కు హింటిచ్చాడు శివాజీ.. ఎలాంటి సిట్యువేషన్ వచ్చినా ఆలోచించి డెసిషన్ తీసుకో అంటూ ఇండైరెక్ట్‌గా బ్రీఫ్‌కేస్ గురించి ఐడియా ఇచ్చాడు. ఇలా శివాజీ హింట్‌ను పట్టేసిన యావర్‌ సూట్‌కేస్‌తో బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన ఇద్దరి శిష్యుల్లో ఒకరి చేతిలో టైటిల్.. మరొకరి చేతిలో మనీ బ్రీఫ్‌కేస్ పెట్టాలని శివాజీ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోందని.. ఇలా తన శిష్యులను మంచోడు అన్న పేరుతో బయటకు రావాలని ప్లాన్ చేసినట్లున్నాడంటున్నారు నెటిజన్లు..