మరో వివాదంలో ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైల్లో వేయమంటున్న స్టూడెంట్స్…!

బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు. బహుశా అల్లు అర్జున్ కు కూడా ఇదే జరుగుతున్నట్టుంది. కెరీర్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు ఈయన.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 12:20 PMLast Updated on: Apr 23, 2025 | 12:20 PM

In Another Controversy Students Are Demanding That Icon Star Allu Arjun Be Arrested And Thrown In Jail

బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు. బహుశా అల్లు అర్జున్ కు కూడా ఇదే జరుగుతున్నట్టుంది. కెరీర్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు ఈయన. బన్నీ సినిమాలు వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇంత అద్భుతమైన కెరీర్ ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇదంతా పుష్ప 2 నుంచి మొదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ లో భాగంగా జరిగిన తొక్కేసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర ఒకరు చనిపోవడంతో అక్కడి నుంచి అల్లు అర్జున్ కష్టాలు మొదలయ్యాయి. ఆ వివాదంలో ఏకంగా జైలుకు కూడా వెళ్ళొచ్చా ఆయన. అది అయిపోయింది అనుకుంటే తాజాగా మరొక వివాదం అల్లు అర్జున్ మెడకు చెప్పుకునేలా కనిపిస్తోంది. ఈసారి బన్నీతో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా ఇందులో ఉంది. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయండి అంటున్నారు స్టూడెంట్ యూనియన్స్. ఈ మధ్య కాలంలో డబ్బులు వస్తున్నాయి కదా అని బ్రాండింగ్ విషయంలో ముందు గనుక చూసుకోవడం లేదు మన హీరో హీరోయిన్లు. అలా కొన్నింటికి బ్రాండింగ్ చేసి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు.

తాజాగా మహేష్ బాబుకు కూడా ఈడి నోటీసులు అందుకే వచ్చాయి. ఇక బన్నీ, శ్రీలీల విషయానికి వస్తే.. ఈ ఇద్దరు విడివిడిగా ఓ కార్పోరేట్ విద్యాసంస్థకు సంబంధించిన యాడ్ లో నటించారు. విద్యార్థులని అందులో జాయిన్ అయ్యేలా చేస్తున్నారు.. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. డూప్లికేట్ ప్రమోషన్స్ తో విద్యార్థులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని విజయవాడ కౌన్సిల్ అఖిల భారత్ విద్యార్థి సంఘం వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరినీ అరెస్ట్ చెయ్యాలని.. వాళ్ళపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే బ్రాండింగ్ నమ్మి చాలా మంది విద్యార్థులు మోసపోతున్నారని.. ఆ విద్యాసంస్థల్లో చేరి ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు అర్ధంతరంగా చనిపోతున్నారు అంటూ స్టూడెంట్ యూనియన్ మండిపడుతుంది. అయినా ఈ మధ్య అల్లు అర్జున్ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం ఫస్ట్ టైం ఏమీ కాదు.

మనోడికి ఆల్రెడీ ఇప్పటికే ఉన్న తలనొప్పులు సరిపోవు అన్నట్టు ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చి జాయిన్ అయింది. మామూలుగా అయితే విద్యాసంస్థల కమర్షియల్ యాడ్ చేసినప్పుడు ఎలాంటి తలనొప్పులు ఉండవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సిచువేషన్స్ చూసిన తర్వాత ఏ యాడ్ చేసిన ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే దాని కాన్ సీక్వెన్సెస్ ఏంటి అనేది ముందుగానే ఊహించి ఒక బ్రాండ్ సైన్ చేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. అలా కాకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేస్తే మాత్రం తర్వాత ఇలాంటి తలనొప్పులు ఫేస్ చేయక తప్పదు. ఇందులో బన్నీతో పాటు శ్రీలీల కూడా ఉంది. మెడిసిన్ చేస్తా డాక్టర్ అవుతా అంటూ ఈమె చేసిన ఆడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ కమర్షియల్ యాడ్ ఆమెకు తలనొప్పులు తీసుకొచ్చి పెట్టింది. మరి ఈ వివాదం మీద బన్నీ, శ్రీలీల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.