Gangs of Godavari : బాలయ్యను ఆడుకుంటున్న బాలీవుడ్..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) మూవీ ప్రీ రిలీజ్ (Pre Release) ఫంక్షన్‌లో.. బాలయ్య చేసిన రచ్చ.. ఇంకా రీసౌండ్ ఇస్తూనే ఉంది. బాలకృష్ణ పక్కన మందుబాటిల్ కనిపించింది. ఐతే అదంతా గ్రాఫిక్స్ అని ఆ మూవీ టీమ్ కొట్టిపారేసింది.

In Gangs of Godavari movie pre release function.. Balayya's ruckus.. is still giving resound.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) మూవీ ప్రీ రిలీజ్ (Pre Release) ఫంక్షన్‌లో.. బాలయ్య చేసిన రచ్చ.. ఇంకా రీసౌండ్ ఇస్తూనే ఉంది. బాలకృష్ణ పక్కన మందుబాటిల్ కనిపించింది. ఐతే అదంతా గ్రాఫిక్స్ అని ఆ మూవీ టీమ్ కొట్టిపారేసింది. ఈ వివాదం కూల్ అయింది అనుకునే లోపు.. అంజలిని బాలయ్య నెట్టేసిన వీడియోపై ఇప్పుడు కొత్త రచ్చ క్రియేట్ చేస్తోంది. బాలయ్య తీరుపై నెటిజన్లతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య తీరుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
ఎవడీ పిచ్చోడు అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆయన ట్వీట్.. ఇప్పుడు వైరల్‌గా మారింది. స్కామ్ 1992, ఛల్, షాహిద్, సిటీలైట్స్, అలీఘర్‌లాంటి సినిమాలతో హన్సల్ తనకంటూ ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకున్నడా.. బాలీవుడ్ యాక్టర్ నకుల్ మెహతా కూడా బాలయ్య వీడియోపై రియాక్ట్ అయ్యాడు. బాలకృష్ణ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించొద్దంటూ.. ఘాటుగా పోస్ట్ చేశారు. ఇక అటు నెటిజన్లు బాలయ్య తీరుపై ఫైర్ అవుతున్నారు. చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా.. మహిళలను ఎలా గౌరవించాలో తెలియని మనిషంటూ బాలయ్యపై మండిపడుతున్నారు.
ఇలాంటి చర్యలు చూసినప్పటికీ బాలయ్యను వెనకేసుకొచ్చే వారున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అలా చేస్తుంటే నవ్వడమేంటని.. అంజలిని కూడా తప్పు పడుతున్నారు మరికొందరు. ఇక సింగర్ చిన్మయి కూడా.. అంజలిని నెట్టేసిన వీడియోపై.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను గమనించిన అతిపెద్ద సమస్యల్లో దీ ఒకటి. ఆమె నవ్వును చూడండి. ఆమెకైనా ఉండాలి కదా అంటూ అంజలిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ఐతే ఈమెను కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. బాలయ్య పేరు ఎత్తే ధైర్యం లేక అంజలిని అంటున్నావా అంటూ ఆడుకుంటున్నారు.