Pawan Kalyan : OGని అన్నీ రోజుల్లో కంప్లీట్ కావాల్సిందే…
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) నటిస్తున్న సినిమాల్లో ఓజి ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్‌గా ఓజిని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. అయితే.. తాజాగా పవన్ ఈ సినిమాకు డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

In how many days should OG be completed?
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) నటిస్తున్న సినిమాల్లో ఓజి ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్‌గా ఓజిని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. అయితే.. తాజాగా పవన్ ఈ సినిమాకు డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కంటే.. రాజకీయంగానే హాట్ టాపిక్ అవుతున్నాడు. పార్టీని నడిపించడం కోసం యాడ్స్ చేస్తున్నాడని.. ఆస్తులు కూడా అమ్ముతున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. అసలు ఇలాంటి వార్తల్లో ఎంత వరకు నిజముందనేది మాత్రం తెలియదు. ఇక పవన్ సినిమాల విషయానికోస్తే.. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓజి సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. పవన్ నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు కంటే.. ఓజి షూటింగ్‌నే ఎక్కువ శాతం జరిగింది.
జస్ట్ పవర్ స్టార్ ఈ సినిమాకు 15 నుంచి 20 రోజులు డేట్స్ ఇస్తే చాలు షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పవన్ ఓజి సినిమాకు కేవలం 15 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని చెప్పాడట. ఈ 15 రోజుల్లోనే తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని సుజీత్‌కి డెడ్ లైన్ పెట్టాడట. దీంతో సుజీత్‌కు ఇదో ఛాలెంజ్ అనే చెప్పాలి. కానీ పవర్ స్టార్ ఈ 15 రోజుల డేట్స్ ఎప్పుడు ఇస్తాడనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఉంటే.. ఏపి ఎలక్షన్స్ అయిపోగానే ఓజి షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే సెప్టెంబర్ 27న ఓజి మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది డివివి ఎంటర్టైన్మెంట్స్. దీంతో సుజీత్.. అదే డేట్ టార్గెట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలి. ఇక ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి సుజీత్ అనుకున్న సమయానికి ఓజిని థియేటర్లోకి తీసుకొస్తాడా? పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడనేది చూడాలి