Prabhas : ప్రభాస్’ విషయంలో అదంతా ఫేక్

ఎట్టకేలకు బాహుబలి (Baahubali) తర్వాత సలార్ (Salaar) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్(Prabhas). ప్రస్తుతం ఓటిటిలో భారీ రెస్పాన్స్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది సలార్. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్‌ జానర్లో తెరకెక్కుతోంద

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2024 | 10:48 AMLast Updated on: Feb 03, 2024 | 10:48 AM

In Prabhas Case It Is All Fake

 

 

ఎట్టకేలకు బాహుబలి (Baahubali) తర్వాత సలార్ (Salaar) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్(Prabhas). ప్రస్తుతం ఓటిటిలో భారీ రెస్పాన్స్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది సలార్. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్‌ జానర్లో తెరకెక్కుతోంద

ఇప్పటికే రిలీజ్ అయిన కల్కి(Kalki) గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది. 2024 మే 9న కల్కి మూవీ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు విడుదలైన రోజే.. కల్కి కూడా వస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

అయితే.. రీసెంట్‌గా ప్రభాస్ కల్కి, రాజా సాబ్‌ (Raja Saab) షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి యూరప్‌కి వెళ్లాడనే వార్తలొచ్చాయి. అలాగే కల్కి వాయిదా పడే ఛాన్స్ ఉందని రూమర్‌ వచ్చాయి. కానీ ప్రభాస్ పీఆర్ టీం నుంచి ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రామోజీ ఫిలిం సిటీలో కల్కి కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కొన్ని కీలక సీన్లను షూట్‌ చేయనుండగా.. త్వరలోనే ప్రభాస్‌ ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నాడట. రిలీజ్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. వీలైనంత త్వరగా కల్కి షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పై దృష్టి సారించనున్నారు మేకర్స్. మరి కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.