Prabhas: యంగ్ రెబల్ స్టార్ ని వేటాడుతున్నారు.. వదిలిపెట్టేలా లేరు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని వేటాడటం, వెంటాడటం, ఇదే పనిగా పెట్టుకున్నారు దర్శకుడు. సలార్ మూవీ 90శాతం పూర్తైంది. ప్రాజెక్ట్ కే 80 శాతం పూర్తైంది. అయినా నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ని వేంటాడుతూనే ఉన్నారట.

In Prabhas Movie Project K, Kamal Hajas is reported to be introduced only for Part 2, which means that the movie will be released in two parts
అసలు మ్యాటర్ ఏంటంటే ప్రాజెక్ట్ కే కి రెండో భాగం ప్లాన్ చేశారు. ఎలాగూ ఇప్పుడు ప్రాజెక్ట్ కే పూర్తికావొస్తోంది. ఆతర్వాతే పార్ట్ 2 తెరకెక్కనుంది. కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే క్లైమాక్స్ లోమాత్రమే కనిపిస్తాడని, పార్ట్ 2 కోసమే తన పాత్రని పరిచయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక పార్ట్ 2 అంటే ఎప్పుడో సినిమా రిలీజయ్యాక కొన్నేళ్లకు తీస్తారా అంటే అలా కాదు, 2024 జూన్ లోనే సలార్ 2 పట్టాలెక్కబోతోందట.
ఓవైపు మారుతి మూవీ పూర్తవుతుంది. తర్వాత స్పిరిట్ షూటింగ్ కి రెడీ అవుతున్న ప్రభాస్, ప్యార్ లల్ గా ప్రాజెక్ట్ కే రెండో భాగం కూడా చేస్తాడట. అలానే మహేశ్ తో రాజమౌళి తీసే మూవీ రెండు భాగాలుగా తెరకెక్కబోతోందట. సో ఇలా చూస్తే మహేశ్, ప్రభాస్ ఇద్దరూ కూడా చేస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే కూడా, మళ్లీ అవే కథల కొనసాగింపుతో రెండు మూడేళ్లు సెట్లకే పరిమితం అవటం ఖాయంగా కనిపిస్తోంది.