Pushpa 2 song : పుష్ప 2 సాంగ్ లో ఆమె కాదు.. బడా హీరోయినే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప సెన్సేషన్ సక్సెస్ ను అందుకుంది. అందుకే పుష్ప సీక్వెల్‌ కోసం సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అయితే ఇంకాస్త ఎక్కువ. ఇప్పుడు పుష్ప 2 ది రూల్‌ మూవీ షూటింగ్‌ కి కాస్త బ్రేక్ పడింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2024 | 01:31 PMLast Updated on: Jan 09, 2024 | 1:31 PM

In Pushpa 2 Song She Is Not The Big Heroine

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప సెన్సేషన్ సక్సెస్ ను అందుకుంది. అందుకే పుష్ప సీక్వెల్‌ కోసం సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అయితే ఇంకాస్త ఎక్కువ. ఇప్పుడు పుష్ప 2 ది రూల్‌ మూవీ షూటింగ్‌ కి కాస్త బ్రేక్ పడింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పుష్ప మొదటి భాగం బాక్సాఫీసు దగ్గర పలు రికార్డులు బద్దలు కొట్టింది. కలెక్షన్లను కుమ్మేసింది. దేశమంతటా ఈ సినిమా పాటలుమారుమోగాయి. రెండో పార్ట్‌ అంతకు మించి గొప్పగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్‌.

పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్‌ ఊ అంటావా మామ ఊఊ అంటావా పాట ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటకు పలువురు సెలబ్రిటీలు డాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసిందా పాట. అయితే పుష్ప-2లో అదిరిపోయే ఐటమ్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఐటమ్‌ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో దీనికి సంబందించిన ఒక క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

పుష్ప 2 లోని ఐటెం సాంగ్ ని మొదటగా చిరంజీవి తో వాల్తేరు వీరయ్య మూవీలోని ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రౌతాలా మీద తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ పుష్ప లోని ఐటెం సాంగ్ కి వచ్చిన బజ్ రావాలంటే సమంత లాంటి స్టార్ హీరోయిన్ చేత చేయిస్తేనే బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఐటమ్ సాంగ్ ని సుకుమార్ చాలా ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేసాడనే వార్తలైతే వస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలని భావిస్తున్నారు. బన్నీలో చిందులు వేసే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది.