1000 కోట్ల వేటలో… ముగ్గురు మొనగాళ్లే…
రెబల్ స్టార్ ప్రభాస్ కి వెయ్యికోట్లు వసూల్లు కొత్తకాదు. రెండు సార్లు పాన్ ఇండియాను 1000 కోట్లకుమించే వసూల్లతో షేక్ చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ చరన్ కూడా త్రిబుల్ ఆర్ తో వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు.

రెబల్ స్టార్ ప్రభాస్ కి వెయ్యికోట్లు వసూల్లు కొత్తకాదు. రెండు సార్లు పాన్ ఇండియాను 1000 కోట్లకుమించే వసూల్లతో షేక్ చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ చరన్ కూడా త్రిబుల్ ఆర్ తో వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా మొన్నే వెయ్యికోట్ల పండగొచ్చింది. ఐతే ఇప్పడు ప్రభాస్, చరణ్, ఈ ఇద్దరి తో కలిసి ఒకసారి కాదు, రెండు సార్లు వెయ్యికోట్లకు వెల్ కమ్ చెప్పబోతున్నాడు ఎన్టీఆర్. అది కూడా ఒక పండక్కి కాదు, రెండు పండగలకి రెండు సార్లు వెయ్యికోట్లకు వలేస్తున్నాడు. ప్రభాస్ తో ఓసారి ఫైట్ కి రెడీ అయిన ఎన్టీఆర్, ఫస్ట్ టైం చరణ్ తో ఢీ అంటే ఢీ అనబోతున్నాడు. ఇంతవరకు వెండితెరమీదే చరణ్, ఎన్టీఆర్ కలిసి ఫైట్ చేశారు. ఇప్పుడు వేరు వేరు థియేటర్స్ లో ఫైట్ చేయబోతున్నారు. రెబల్ వర్సెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్… గ్లోబల్ స్టార్ వర్సెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్… ఇలా వచ్చే ఏడాది జూన్ నుంచే వార్ షురూ కాబోతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్, రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ఇలా ముగ్గురు మొనగాళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ ఒక ఏడాది కాదు, ఏకంగా మూడేళ్లు కొనసగాబోతోంది. ఇంతవరకు చరణ్, ఎన్టీఆర్ సినిమా లు పెద్దగా ఎప్పుడూ పోటీ పడలేదు. ఇద్దరూ కలిసి పోటీ పడి నటించి త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్స్ గా మారారు. నాటు నాటు పాట తూటాలా వైరలయ్యేందుకు మూమెంట్స్ తో మ్యాజిక్ చేశారు.కాని ఫస్ట్ టైం ఎన్టీఆర్ వర్సెస్ చరణ్ అన్న మాట పాన్ ఇండియా లెవల్లో కనిపించబోతోంది. అంతకంటే ముందు రెబల్ స్టార్ తో ఎన్టీఆర్ బిగ్ ఫైట్ కి డేట్ ఫిక్స్ అయినట్టుంది. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ది రాజా సాబ్ ఆల్ మోస్ట్ జులై ఎండ్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని ఆగస్ట్ 14 కి ఎన్టీఆర్ మల్టీ స్టారర్ హిందీ మూవీ వార్ 2 రిలీజ్ కాబోతోంది.
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ హీరోగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నెగెటీవ్ రోల్ లో చేస్తున్న వార్ 2 మూవీ ఆగస్ట్ 14 కి రిలీజ్ అని ఎప్పుడో తేల్చారు. ఐతే ఇప్పడు సీన్ లోకి ది రాజా సాబ్ మూవీ వచ్చేలా ఉంది. ఏప్రిల్ 10కి రిలీజ్ ప్లాన్ చేస్తే, అది కుదిరేలా లేదు. మోకాలి గాయం, తర్వాత చికిత్స ఆతర్వాత రెస్ట్ … ఇలా ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే టైంలో బ్రేక్ తీసుకున్నాడు ప్రభాస్. ఆ బ్రేక్ తర్వాత ఫౌజీ షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఎలా చూసినా ఏప్రిల్ 10 నుంచి మే అటునుంచి జూన్ కి ది రాజా సాబ్ రిలీజ్ వాయిదా అనుకుంటే, డేట్ జులైకి షిఫ్ట్ అయినట్టుంది.జులై 25 లేదంట 30 కి ది రాజా సాబ్ రిలీజ్ అవ్వొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఇది విడుదలైన రెండు వారాలకే హ్రితిక్, ఎన్టీఆర్ మూవీ వార్2 వస్తుంది. సో 15 రోజుల గ్యాపే ఉన్నా రెండూ భారీ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, ఒకరి ఎఫెక్ట్ మరోకరి మీద ఉండొచ్చు…ఇదే కాదు 2026 లో డ్రాగన్ వర్సెస్ చరణ్ పెద్ది మూవీ ఉండొచ్చని తెలుస్తోంది.
నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి డ్రాగన్ రిలీజ్ అని తేల్చారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవటం కష్టంగానే ఉంది. కారణం వార్ 2 ఫైనల్ షెడ్యూల్ ఇంకా పూర్తి కాకపోవటమే.. ఇది డిలే అవటంతో ఈ పాటికే డ్రాగన్ సెట్లో డుగుపెట్టాల్సిన ఎన్టీఆర్, ఇంకో రెండు వారాలు వార్2 మూవీ షూటింగ్ తోనే బిజీ అయ్యేలా ఉన్నాడు.ఫలితంగా 2026 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న డ్రాగన్ సమ్మర్ కి షిఫ్ట్ అయ్యేలా ఉందట. డ్రాగన్ తో పాటు చరణ్ పెద్ది కూడా 2026 ఉగాదికే వచ్చే అవకాశం ఉండటంతో, అక్కడ ఈ ఇద్దరి మధ్య పోటీ అంటున్నారు. ఇక 2026 దసరాకి దేవర 2 తో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఫౌజీ పోటీ పడే ఛాన్స్ ఉంది. ఎలాచూసినా ఈ ఏడాది వచ్చే ఏడాది, ఇలా వరుసగా ప్రభాస్ తో ఎన్టీఆర్ రెండు సార్లు, ఎన్టీఆర్ తో చరణ్ ఒకసారి సినిమా తో పోటీ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు ఒకటి తర్వాత ఒకటి అనుకునే ఛాన్స్ లేదు. పాన్ ఇండియా లెవల్లో పండగలు, డేట్లు అన్నీ సెట్ అవ్వాలి కాబట్టి, ఎవరూ ఎవరికోసం రిలీజ్ డేట్లు త్యాగం చేసే పరిస్తితి కనిపించట్లేదు. కాబట్టి పాన్ ఇండియా లెవల్లో తెలుగు హీరోతో తెలుగు హీరోనే పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది.