Trivikram: ఎన్టీఆర్ తర్వాత మహేశ్ తో పెట్టుకుంటున్న త్రివిక్రమ్..
ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కి గొడవ.. ఆమధ్య పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ పట్టాలు తప్పింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గొడవ.. ఈ సినిమాకూడా ఓసారి పట్టాలు తప్పినట్టే తప్పి మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పుడు వివాదాలు పెరుగుతుండటంతో మాటల మాంత్రికుడు విమర్శల పాలవుతున్నాడు.

Maheshbabu Serious on Trivikram
గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే ని తీసేశారట. కారణం ఆమెకు వరుస ప్లాపులుండటంతో గతంలోనే మహేశ్ వద్దన్నా, త్రివిక్రమే కన్విన్స్ చేసి తనని తీసుకున్నాడట. ఐతే పూజా హెగ్డే, త్రివిక్రమ్ మీద గాసిప్స్ గుప్పుమనటంతో, ఈ నాన్సెస్ వద్దని, తనని పీకేసి, శ్రీలీలనే మేయిన్ హీరోయిన్ గా కథకు రిపేర్లు చేయమన్నాడట మహేశ్.
ఇదేనా తమన్ లేజీ వర్క్, గుంటూరు కారం గ్లింప్స్ మీద పెరిగిన బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వల్ల, ఈ మ్యూజీషియన్ ని కూడా వద్దని మహేశ్ పట్టుబడుతున్నాడు. కాని త్రివిక్రమ్ ఎలాగోలా మహేశ్ ని కన్విన్స్ చేసి, తమన్ ని పని మీద ఫోకస్ చేసేలా ప్రెజర్ పెట్టాడని తెలుస్తోంది.
నిజానికి మహేశ్ కి త్రివిక్రమ్ మీదే నమ్మకం లేదట. గతంలో ఖలేజా టైంలో కూడా తన లేజీ వర్క్, హీరోయిన్ల గుసగుసలు నచ్చకే తనకి దూరంగా ఉన్నాడనంటారు. దీనికి తోడు పవన్ తో స్నేహం , తనతో అటాచ్ మెంట్ పెరగటంతో, మహేశ్ తో చేయాల్సిన మూవీ మీద కంటే, పవర్ స్టార్ కెరీర్ మీదే త్రివిక్రమ్ కి ఫోకస్ ఎక్కువైంది. అలానే అల్లు అర్జున్ తో తన కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా మహేశ్ కి చిర్రెత్తుకొచ్చిందట.
తన సినిమా తప్ప మిగతా అన్ని పనుల మీద త్రివిక్రమ్ శ్రద్ద చూపిస్తున్నాడు అని, అందుకే గుంటూరు కారంలో ఘాటు ఎటో ఎల్లిపోతోందనేది మహేశ్ కోపంగా ఉన్నాడట. దీనికి తోడు తమన్ మొన్న న్యూజెర్సీలో మహేశ్ చిన్నాన్న ఆది శేషగిరిరావ్ ని అవమానించినట్టు మాట్లాడటం కూడా మహేశ్ కోపానికి కారణం అని తెలుస్తోంది. గుంటూరు కారం టీం కష్టపడాలంటూ మహేశ్ ఫ్యాన్స్ కూడా యాష్ ట్యాగ్ తో కామెంట్స్ చేయటం హాట్ టాపికైంది. మొత్తంగా ఇదో పెద్ద వివాదంగా మారేలా ఉంది.