Mahesh Babu, Rajamouli : మహేష్ 2024 నుంచి అన్ని బంద్ పెట్టాల్సిందే..
టాలీవుడ్ లో ఎక్కువగా విదేశాలకు వెళ్లి రిలాక్స్ అయ్యే హీరోలో ముందు ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే షెడ్యూల్ లో కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీని తీసుకొని ట్రిప్పులకు వెళుతుంటాడు. యావరేజ్ గా మహేష్ బాబు సగటున ఏడాదికి ఐదు సార్లు ఫారిన్ టూర్ లకు వెళుతుంటాడు అయితే ఈ పర్యటనలకు ఇక బ్రేక్ పడబోతోంది.

In Tollywood, superstar Mahesh Babu is one of the heroes who mostly go abroad and relax. Mahesh should put a ban on everything from 2024.
టాలీవుడ్ లో ఎక్కువగా విదేశాలకు వెళ్లి రిలాక్స్ అయ్యే హీరోలో ముందు ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే షెడ్యూల్ లో కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీని తీసుకొని ట్రిప్పులకు వెళుతుంటాడు. యావరేజ్ గా మహేష్ బాబు సగటున ఏడాదికి ఐదు సార్లు ఫారిన్ టూర్ లకు వెళుతుంటాడు అయితే ఈ పర్యటనలకు ఇక బ్రేక్ పడబోతోంది.
Miss Universe : మిస్ యూనివర్స్‌గా నికరాగ్వా బ్యూటీ
2024 నుంచి మహేష్ తీరికలేనంత బిజీగా ఉండాల్సి రాబోతోంది. వచ్చే ఏడాదే రాజమౌళి దర్శకత్వంలో సినిమా ప్రారంభమవుతుంది. జక్కన్న సీన్ లోకి దిగాడంటే సన్నివేశం ఎలా ఉంటుందో అతనితో పనిచేసిన వారికి తెలుస్తుంది. రాజమౌ ళి షూటింగ్ మొదలైందంటే ముగించే వరకూ ఎటూ కదలడానికి వీలుండదు. రాజమౌళి వెంటే హీరో ఉండాల్సి ఉంటుంది. అది ఇండియాలో అయినా..విదేశాల్లో షూటింగ్ అయినా సరే. సెట్స్ దాటి బయటకు వెళ్లడానికి జక్కన్న ఒప్పుకోడు. ఇతర హీరోలు అంత బాండింగ్ తో డెడికేషన్ తో పని చేశారు కాబట్టే బాహుబలి ఆర్ఆర్ వంటి సినిమాలకు అంత గొప్ప ఔట్ ఫుట్ వచ్చింది. హీరోల స్థాయి పెరిగింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది.
ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం ఐదారు సార్లు కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్లకు వెళ్తుంటాడు మహేష్. అయితే.. ఈ విషయంలో 2023 వరకు ఒక లెక్క.. తర్వాత ఒక లెక్క అన్నట్లు పరిస్థితి మారబోతుందట. జక్కన్నతో ఒక్కసారి షూటింగ్ మొదలైందంటే కంప్లీట్ అయ్యేవరకు టీం అంతా రాజమౌళితో ఉండాల్సిందే. సెట్స్ దాటి బయటకు వెళ్ళడానికి ఈ దర్శకుడు అసలు ఒప్పుకోడు. అంత అంకితభావంతో మూవీని చిత్రీకరిస్తాడు రాజమౌళి. మరి మహేష్ బాబు కూడా జక్కన్న తో కలిసి ఇలాగే పనిచేయాల్సి ఉంటుంది. ఏదేమైనా.. రాజమౌళి చిత్రం పూర్తయ్యే వరకు మహేష్ కు వెకేషన్స్ కష్టమే చూడాలి మరి రాజమౌళి చేతిలో మహేష్ బాబు ఎలా మౌల్డ్ అవుతాడో..