Ram Charan: కమల్ హాసన్ కొంపముంచిన రామ్ చరణ్.. ఇదేం నిర్ణయం..?
నిజానికి భారతీయుడు-2 ని వేగంగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కి 3 నెలలటైం తీసుకోవాలనుకున్నాడు శంకర్. కాని ఇప్పుడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని పక్కన పెట్టి రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్‌ని పూర్తి చేయబోతున్నాడట. జులై 3వ వారంలో మొదలుపెట్టి సెప్టెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేస్తాడు.
Ram Charan: కమల్ హాసన్ మూవీ భారతీయుడు-2 పూర్తి కావొచ్చింది. ఇలాంటి టైం లో కమల్ హాసన్‌కి రామ్ చరణ్ రూపంలో ట్విస్ట్ ఎదురైంది. పాప పుట్టిన ఆనందంలో సంబరాల్లో ఉన్న చెర్రీ జులై థర్డ్ వీక్ నుంచి గేమ్ ఛేంజర్ మూవీ పెండింగ్ షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. నిజానికి భారతీయుడు-2 ని వేగంగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కి 3 నెలలటైం తీసుకోవాలనుకున్నాడు శంకర్. కాని ఇప్పుడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని పక్కన పెట్టి రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్‌ని పూర్తి చేయబోతున్నాడట.
జులై 3వ వారంలో మొదలుపెట్టి సెప్టెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేస్తాడు. ఎలాగైనా సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్ ఉండాలని, ఇలా శంకర్ నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందట. రామ్ చరణ్, దిల్ రాజు నుంచి ప్రెజర్ ఆ రేంజ్‌లోఉంది. అలా అని కమల్ హాసన్‌తో తీస్తున్న భారతీయుడు-2 ఆపుతాడా అంటే అదీ లేదు. షూటింగ్ మాత్రం పూర్తి చేస్తాడట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం వాయిదా పడుతోందట. అలా జరిగితే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రావొచ్చు. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా అవసరమున్న భారతీయుడు-2 సమ్మర్‌కి కూడా రాకపోవచ్చంటున్నారు. శంకర్ దగ్గరుండి చూసుకోవాల్సిన పని ఎక్కువగా ఉండటమే ఈ వాయిదాలకు కారణంగా తెలుస్తోంది.