KALKI 2898 AD: ఇండియన్ ఆడియెన్స్ ఎదురు చూస్తోంది ఈ సినిమాల కోసమే..

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడతోపాటు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకూడా ఇలా మొత్తంగా పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ఆసక్తిగా పుష్ప రాజ్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అలా మోస్ట్ అవైటెడ్ మూవీ అనిపించుకున్న పుష్ప 2 లానే ఆలిస్ట్‌లో చేరింది రెబల్ స్టార్ మూవీ కల్కి 2898 ఏడీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 06:07 PMLast Updated on: Feb 02, 2024 | 6:07 PM

Indian Audience Waiting For Pushpa 2 Kalki 2898 And Other Movies

KALKI 2898 AD: ఐకాన్ స్టార్‌తో సుకుమార్ తీసిన పుష్ప.. ఫ్లవర్ కాదు.. ఫైర్ అని రిలీజయ్యాకే తేలింది. క్రికెటర్స్ నుంచి తోటి సినిమా స్టార్స్ వరకు అంతా ఫిదా అయ్యేలా చేసింది. ఆ సినిమాకే సీక్వెల్ ఎప్పుడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్‌కి వస్తుందనుకంటే, ఈ ఏడాది ఆగస్ట్ 15కి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. తర్వాత వాయిదా అంటూ పుకార్లు వచ్చినా, రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పులేదన్నారు.

CHIRANJEEVI: సారీ అన్నయ్య.. నాతో చిరంజీవిని తిట్టించింది వాళ్లే.. నిజం చెప్పిన రైటర్‌ చిన్నికృష్ణ

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడతోపాటు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకూడా ఇలా మొత్తంగా పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ఆసక్తిగా పుష్ప రాజ్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అలా మోస్ట్ అవైటెడ్ మూవీ అనిపించుకున్న పుష్ప 2 లానే ఆలిస్ట్‌లో చేరింది రెబల్ స్టార్ మూవీ కల్కి 2898 ఏడీ. అసలే సలార్ హిట్‌తో ప్రభాస్ ఈజ్ బ్యాక్ అన్నారు. అలా తను స్వింగ్‌లో ఉండగానే కల్కి 2898 ఏడీ మే కి రాబోతోందని తేల్చారు. కాబట్టి.. బాహుబలి హిట్ తర్వాత బాహుబలి 2 కోసం వెయిట్ చేసినట్టు సలార్ హిట్ తర్వాత సలార్ 2 కోసం ఎదురుచూసే బ్యాచ్ అంతా, కల్కి కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. అసలే కల్కి అవతారంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న ప్రభాస్ ఏం రేంజ్‌లో దుమ్ముదులిపాడో చూడాలనే క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది. ఇక హాలీవుడ్ మూవీల ప్రోమోలను లాస్ ఏంజిల్స్‌లోని సూపర్ బౌల్ ఈవెంట్‌లో లాంచ్ చేసినట్టే కల్కి టీజర్‌ని అలానే లాంచ్ చేయబోతున్నారు.

అలా కూడా ఈ మూవీ మీద క్యూరియాసిటీ పెరిగింది. హిందీలో అక్షయ్ కుమార్ వెల్‌కమ్ టు జంగిల్, అజయ్ దేవగన్ సింగం ఎగైన్ సినిమాలు కూడా ఇంటర్నెట్ మూవీ డాటాబేస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్‌లో చేరాయి. విచిత్రం ఏంటంటే రెండు హిందీ మూవీలకోసం, రెండు తెలుగు సినిమాలకోసం పాన్ ఇండియా లెవల్లో ఎదురుచూస్తున్న జనం, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకోసం మాత్రం అంతగా ఎదురుచూడకపోవటం ఆశ్చర్యకరంగా మారింది.