INDIAN MOVIES: పదివేల కోట్లకు చేరువలో ఇండియన్ సినిమా..?
త్రిబుల్ ఆర్ రూ.1240 కోట్లు, కేజీయఫ్ 2 రూ.1220 కోట్లు, జవాన్ ఇప్పటివరకు రూ.1100 కోట్లు, పఠాన్ 1050 కోట్లు రాబట్టాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 6 సినిమాలు ఇప్పటి వరకు రూ.వెయ్యికోట్ల వసూళ్లని దాటేశాయి. సో.. ఇప్పుడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంటే కనీసం రూ.1000 కోట్లు రాబట్టాలనే బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది
INDIAN MOVIES: ఇండియన్ సినిమా స్టామినా పెరుగుతోంది. ఒకప్పుడు వందకోట్లే పెద్ద విషయం. అలాంటి టైంలో రూ.500 కోట్లతో బాహుబలి ఇండియన్ సినిమాకు కొత్త వసూళ్ల లెక్కని పరిచయం చేసింది. దంగల్ వచ్చి రూ.2,400 కోట్లు రాబట్టింది. బాహుబలి 2 మూవీ రూ.1800 కోట్లతో షాక్ ఇచ్చింది. ఇలా లెక్కేస్తూ పోతే త్రిబుల్ ఆర్ రూ.1240 కోట్లు, కేజీయఫ్ 2 రూ.1220 కోట్లు, జవాన్ ఇప్పటివరకు రూ.1100 కోట్లు, పఠాన్ 1050 కోట్లు రాబట్టాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 6 సినిమాలు ఇప్పటి వరకు రూ.వెయ్యికోట్ల వసూళ్లని దాటేశాయి.
సో.. ఇప్పుడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంటే కనీసం రూ.1000 కోట్లు రాబట్టాలనే బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. పదేళ్ల క్రితం ఈ పరిస్థితి హాలీవుడ్ మూవీస్‌కి ఉండేది. అంటే ఇండియన్ మూవీస్ మార్కెట్ మెల్లిగా వరల్డ్ మార్కెట్ రేంజ్‌కి చేరుతున్నట్టే అనుకోవాలి. ఇప్పటి వరకు వెయ్యికోట్లపైనే రాబట్టిన భారతీయ సినిమాల మొత్తం వసూళ్లు రూ.9400 కోట్లు చేరాయి. అంటే ఆల్ మోస్ట్ పదివేల కోట్లు. ఈ ఒక్క ఏడాదే పటాన్, జవాన్, గదర్, ఓమైగాడ్ మూవీలతోపాటు పొన్నియన్ సెల్వన్ 2 వసూళ్లు కలిపితే.. రూ.4 వేల కోట్ల లెక్కతేలింది.
సలార్, టైగర్ 3, డంకీ కూడా ఇలానే దుమ్ముదులిపితే మరో రూ.3 వేల కోట్లు యాడ్ అయినట్టే. ఎలా చూసినా ఒక్కో ఇండస్ట్రీగా కాకుండా.. మొత్తం అన్ని ఇండస్ట్రీలు కలిపి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇయర్లీ పదివేల కోట్ల వసూళ్ల రేంజ్‌కి వెళ్తోంది.