Indiana Jones: ఇండియానా జోన్స్ ఆఖరి పోరాటం.. తుస్సుమందా..?

ఇండియాలో శుక్రవారమే ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ మూవీ రిలీజ్. కాని మెట్రో సిటీస్‌లో ప్రివ్యూ రూపంలో ఈ మూవీ గురువారమే అందుబాటులోకొచ్చింది. యూఎస్, యూకేలో అయితే గురువారం మధ్యాహ్నంకల్లా రివ్యూలొచ్చేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2023 | 05:38 PMLast Updated on: Jun 29, 2023 | 5:38 PM

Indiana Jones And The Dial Of Destiny Review Harrison Ford Gets A Swashbuckling Sendoff In The Movie

Indiana Jones: ఇండియానా జోన్స్ మూవీ స్టోరీ లైన్ రైట్స్ తీసుకుని రాజమౌళి ఇప్పుడు మహేశ్ మూవీ తీస్తున్నాడనే సరికి, ఈ హాలీవుడ్ మూవీ చూసేందుకు థియేటర్స్‌కి క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. ఇండియాలో శుక్రవారమే రిలీజ్ అన్నా, కాని మెట్రో సిటీస్‌లో ప్రివ్యూ రూపంలో ఈ మూవీ గురువారమే అందుబాటులోకొచ్చింది.

యూఎస్, యూకేలో అయితే గురువారం మధ్యాహ్నంకల్లా రివ్యూలొచ్చేశాయి. టైం ట్రావెల్ చేసేందుకు ఉపయోగపడే ఓ డయల్‌ను దుర్మార్గుల చేతుల్లో పడకుండా హీరో అయిన ప్రోఫెసర్ ఇండియానా జోన్స్ ఏం చేశాడు.. చరిత్రనే మార్చేసే శక్తి ఉన్న ఆ డయల్ సాయంతో, చరిత్రని పాడవకుండా గతాన్ని ఎలా కాపాడాడనేదే స్టోరీ లైన్‌. సింపుల్‌గా చెప్పాలంటే మనకే గతంలోకి వెళ్లి తిరిగొచ్చే ఛాన్స్ దొరికితే, గతాన్ని మారుస్తామా? అన్న ప్రశ్నకు సాహసాలు యాడ్ చేసినట్టు తీశారు. కాని మొదటి నాలుగు భాగాలు జురాసిక్ పార్క్ సినిమా ఫేం స్పీల్ బర్గ్ తీస్తే, ఈ ఐదో సీక్వెల్ జేమ్స్ మ్యాన్ తీశాడు. అక్కడే క్రిస్టల్ క్లియర్‌గా స్పీల్ బర్గ్ మేకింగ్‌లో మ్యాజిక్‌ని జేమ్స్ మ్యాన్ క్యాచ్ చేయలేకపోయాడని తెలుస్తోంది.

ఈ సినిమా.. కొండంత రాగం తీసి ఖూనీ రాగాన్ని అందుకున్నట్టుందంటున్నారు ఆడియెన్స్. గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా, గత సీక్వెల్స్ తాలూకు సీన్లను రీ క్రియేట్ చేసే ప్రయత్నంలో, అసలు కొత్త సినిమా చూస్తున్నామా? పాత మూవీకి కాపీని మనముందుకు తీసుకొస్తే, భరిస్తున్నామా అనే కామెంట్లే పెరిగాయి. హాలీవుడ్ లో కథల కొరత ఉందని దీనిద్వారా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.