Indiana Jones: ఇండియానా జోన్స్ మూవీ వస్తోంది.. మహేశ్ పేరు మారుమోగుతోంది..
ఇండియాన జోన్స్ ఐదో సీక్వెల్ ఈ గురువారమే రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వల్ల సూపర్ స్టార్ మహేశ్ పేరు మారుమోగుతోంది. దానికి కారణం రాజమౌలినే. ఇండియానా జోన్స్ కొత్త సీక్వెల్ స్టోరీ లైన్ మీద కాపీ రైట్స్ రాజమౌళి తీసుకున్నాడట. దాని ప్రేరణగానే విజయేంద్ర ప్రసాద్ జులై నెలాఖర్లోగా కథని పూర్తి చేసే పనిలో ఉన్నాడట.

Indiana Jones, director Rajamouli has taken the rights and is making the story with Vijayendra Prasad and is looking to make Mahesh the hero.
సో ఆల్రెడీ రిలీజ్ కాబోతున్న మూవీ స్టోరీ లైన్ ని రాజమౌళి ఎలా వాడబోతున్నాడనే చర్చ ఒకవైపు జరుగుతోంది. లక్కీగా ఇదే చర్చ వల్ల ఇండియన్ మార్కెట్లో ఇండియానా జోన్స్ కొత్త సీక్వెల్ కి భారీగా ప్రచారం దక్కుతోంది. మొదటి నాలుగు భాగాలు జురాసిక్ ఫేం స్పిల్ బర్గ్ తీస్తే, ఐదో భాగం మాత్రం జేమ్స్ మ్యాన్ తీశాడు.
ఇక గతంలో జేమ్స్ బాండ్ మూవీ తీయాలనుకున్న స్పిల్ బర్గ్ ని నిర్మాతలు అవమానించటంతో, జేమ్స్ బాండ్ ని మించే సాహస వీరుడిని తయారు చేయాలని ఇలా ఈ ప్రాజెక్ట్ ని స్రుష్టించాడు స్పిల్ బర్గ్. రెండో భాగం ఇండియా బ్యాక్ డ్రాప్ లో తీస్తే అందులో బాలీవుడ్ స్టార్ అమ్రిష్ పూరి విలన్ గా చేశాడు. కాని ఈ మూవీ కథ భారత్ ని కించపరిచేలా ఉందని అప్పట్లో వివాదాం కూడా చెలరేగింది.
ఐతే ఇప్పుడు ఐదో సీక్వెల్ ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ వల్ల అమ్రిష్ పూరీ పేరు, హీరో మహేశ్ బాబు పేరు మారుమోగుతోంది. ఇండియానా జోన్స్ 2 లో నటించిన అమ్రిష్ పూరీ ఎప్పుడో చనిపోయాడు. అయినా తన పాత్రని గ్రాఫిక్స్ లో ఇండయానా జోన్స్ 5 లో వాడారట. ఇక ఇదే మూవీ స్టోరీలైన్ తో జక్కన్న సినిమా రాబోతుండటంతో, ఆ మూవీ హీరో మహేశ్ పేరు యూఎస్, యూరప్ మీడియాలో మారుమోగుతోందట. ఇలా ఒక సినిమా ఇందరి పేర్లుమారుమోగేలా చేస్తోంది.