Anushka : అనుష్క నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

టాలీవుడ్ (Tollywood) అరుంధతి (Arundhati) అనుష్క (Anushka) శెట్టి క్రేజే వేరు.. నలభై ఏళ్ల వయస్సుకు చేరువైనా ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అందంతో పాటు నటనతోనూ కట్టిపడేసే స్వీటీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు తగ్గించేసింది.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty, Mr. Polishetty) తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఆమె ఫ్యాన్స్ లో ఉంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2024 | 11:20 AMLast Updated on: Feb 08, 2024 | 11:20 AM

Interesting Buzz On Anushka Next

టాలీవుడ్ (Tollywood) అరుంధతి (Arundhati) అనుష్క (Anushka) శెట్టి క్రేజే వేరు.. నలభై ఏళ్ల వయస్సుకు చేరువైనా ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అందంతో పాటు నటనతోనూ కట్టిపడేసే స్వీటీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు తగ్గించేసింది.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty, Mr. Polishetty) తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఆమె ఫ్యాన్స్ లో ఉంది.. అసలు అనుష్క ఎందుకు సినిమాలు చేయడం లేదు..? అమెను ఇంప్రెస్ చేసే కథలు రావడం లేదా..? దర్శకులు ఆమెను పట్టించుకోవడం లేదా..? ఇలా ఎన్నో రకాల డౌట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అనుష్క నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే.. స్వీటీ అభిమానుల కోసం ఇప్పుడు ఓ స్వీట్ న్యూస్ బయటకు వచ్చింది.. అనుష్క నెక్స్ట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

అనుష్క నెక్స్ట్ క్రిష్ (Krish) దర్శకత్వంలో సహా తన హోమ్ బ్యానర్ లో మొదటి సారి నటించబోతుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈమధ్యనే స్టార్ డైరెక్టర్ క్రిష్ అనుష్కని కలిసి ఒక కథ వినిపించారట. దాదాపు ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్ పై సూపర్ బజ్ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆల్రెడీ క్రిష్ డైరెక్ట్ చేసిన వేదం సినిమాలో అనుష్క నటించింది. సో డైరెక్టర్ మీద ఆమెకు మంచి నమ్మకం ఉంది. ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ వారు కూడా నిర్మాణం వహించనున్నారట. ఇక ఈ కాంబినేషన్ పై ఈ నెలలోనే అఫీషియల్ క్లారిటీ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో.. అనుష్క ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

అరుంధతి తర్వాత అలాంటి ప్రయోగాలు రెండు మూడు చేసిన అనుష్క ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ భాగమతి అనే సినిమా చేసింది. అశోక్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా మరోసారి అనుష్క స్టామినా ఏంటో చూపించి స్టార్ సినిమా వసూళ్లకు ధీటుగా కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత నిశ్శబ్ధం అనే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు. మరోసారి అరుంధతి, భాగమతి టైప్ లో ఒక భారీ సినిమా చేయాలని అనుకుంటుంది అనుష్క. క్రిష్ కథ కూడా అలాంటి కథాంశం అవ్వడంతో వెంటనే అనుష్క ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఇక.. క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీదకు వెళ్లి నాలుగేళ్లు అవుతున్నా సినిమా ఇంతవరకు పూర్తి కాలేదు. ఆ సినిమా పూర్తి చేసేందుకు పవన్ ఖాళీగా లేడు. అందుకే క్రిష్ అనుష్కతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ అనుష్కతో క్రిష్ చేస్తున్న ఈ ప్రయోగం ఏంటి..? ఆ సినిమా ఎలా ఉండబోతుంది..? లాంటి విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..