రాకెట్ స్పీడుతో… ఇంతవరకెన్నడూ చూడనిది…!
నటసింహం బాలయ్య వరుసగా 4 హిట్లతో దూసుకుపోతున్నాడు. మొన్నే ఢాకూ మహారాజ్ గా పాన్ ఇండియా మీద ఎటాక్ చేశాడు. అఖండ 2 తో బోయపాటి శీను మేకింగ్ లో మరో ఎటాక్ కి రెడీ అవుతున్నాడు.

నటసింహం బాలయ్య వరుసగా 4 హిట్లతో దూసుకుపోతున్నాడు. మొన్నే ఢాకూ మహారాజ్ గా పాన్ ఇండియా మీద ఎటాక్ చేశాడు. అఖండ 2 తో బోయపాటి శీను మేకింగ్ లో మరో ఎటాక్ కి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రాజెక్టు పట్టాలెక్కింది. రాకెట్ వేగంతో షూటంగ్ జరుగుతోంది. కేవలం 3 నెలలకే 80శాతం టాకీ పార్ట్ పూర్తి చేసేలా 5 షెడ్యూల్స్ తో ప్లాన్ చేశాడు బోయపాటి. కాని అంత అర్జెంట్ గా అఖండ 2 ని ఎందుకు ఫినిష్ చేయాలి.. అఖండ హిట్ తర్వాత అఖండ 2 మీద భారీగా అంచనాలు పెరిగాయి. నార్త్ ఇండియాలో అయితే ఓ తెలుగు సినిమా కోసం ఎదురుచూడటం అనేంది, బాహుబలి 2 తర్వాతు ఇదే అనంటున్నారు. అంతగా నార్త్ జనం అటెన్షన్ లాక్కోవటానికి కారణం అఖండలో వర్కవుట్ అయిన అఘోర కాన్సెప్టే. అంతగా బాగా అందరి అంచనాలు పెంచేసేప్పుడు టైం తీసుకుని టైం బాంబు పేల్చాలి.. కాని టైమే బాంబుగా మారింది. మూడు నెలలు కాదు కుదరితే రెండు నెలల్లోనే అఖండని పూర్తిచేయాలనేంత కసిగా ఉన్నాడు బోయపాటి శీను.. ఎందుకు? టేకేలుక్
ఢాకూ మహారాజ్, భగవంత్ కేసరి, వీర సింహా రెడ్డి, అఖండ ఇలా నాలుగు బ్లాక్ బస్టర్లతో 4 ఏళ్లుగా బాక్సాఫీస్ ని ఏలుతున్నాడు నటసింహం బాలయ్య. ఇప్పుడు బోయపాటి శీనుతో హిట్ మూవీ అఖండకి సీక్వెల్ అఖండ 2 శివ తాండవం చేస్తున్నాడు. ఇందులో కొత్త విషయం ఏది లేదు, ఒకవేళ షాకింగ్ న్యూస్ ఏదైనా ఉందంటే, మరో మూడు నెలల్లో ఆల్ మోస్ట్ అఖండ2 మూవీపూర్తవుతుందట. అంటే మే ఎండ్ లోగా అఖండ 2 టాకీ పార్ట్ షూటింగ్ ని మొత్తంగా పూర్తి చేయటమే కాదు, సగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసేలా ఉన్నాడు బోయపాటి శీను.అంత అర్జెంట్ గా, ఆగమేఘాల మీద రాకెట్ స్పీడ్ తో అఖండ 2 ని ఎందుకు బోయపాటి శీను పూర్తి చేస్తున్నాడు. అఖండ బ్లాక్ బస్టర్ మూవీ, దాని సీక్వెల్ అంటే అంచనాలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టు తీసేందుకు కాస్త టైం తీసుకుని తీయొచ్చుకదా.. అంటే, అలానే తీసినా, టైం మాత్రం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు టీం.
ఖచ్చితంగా పాన్ ఇండియా లెవల్లో కమర్శియల్ కారణాలే ఉన్నాయి. ఆల్రెడీ అఖండ మూవీలో చాలా వరకు కీ సీన్ లు, గ్రాఫిక్స్ బేస్డ్ సీన్లు తీసేశాడు బోయపాటి శీను. ఇక ఇంటర్వెల్ ఫైట్ సీన్ ని ముందే తీసి, దాని గ్రాఫిక్స్ పనులు కూడా మొదలు పెట్టారు. ఇటు షూటింగ్ , అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్యార్ లల్ గా జరుగుతున్నాయి. మే ఎండ్ కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి, పాటల షూటింగ్ మాత్రం నిదానంగా ప్లాన్ చేస్తాడట.అంత అర్జెంట్ గా బాలయ్య తో అఖండ 2ని మే లోగా పూర్తి చేయటానికి రీజనుంది. అదే మహా కుంభ్ మేల.. ఈఏడాది జనవరిలో మొదలై ఈ శివరాత్రికి మహాకుంభమేళా ముగిసింది. ఐతే అఖండ 2 మూవీ నిజానికి లాస్ట్ ఇయర్ మొదలు పెట్టి, ఈ మహాకుంభ్ మేలా టైంలో రిలీజ్ చేస్తే, పాన్ ఇండియా లెవల్లో పూనకాలొచ్చేవి. అలాంటి ఆలోచనలు చేసినా, ప్రాక్టికల్ గా సాధ్య పడలేదు.
అందుకే దసరాకు అఖండని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలా అయితే చాలా టైముంది. కాని మే లోపే షూటింగ్ పూర్తి చేసి, జూన్ నుంచి అసలు ఆట షురూ చేయబోతున్నారు.అఖండ 2 మూవీని గంగా నది ప్రవహించే చాలా పట్టనాల్లో ప్రమోట్ చేయబోతున్నారు. ఇంతవరకు ఎన్నడూ బాలయ్య సినిమా రిలీజ్ కి మూడు నెలల ముందునుంచి ప్రమోషన్ చేసింది లేదు.కాని అఖండ 2 పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. నార్త్ ఇండియా మార్కెట్ ని గట్టిగానే బాలయ్య టీం టార్గెట్ చేసింది. సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అఖండ 2 ప్రమోషన్ కోసం నార్త్ ఇండియాకి ఏకంగా 80 టూర్లు ప్లాన్ చేసింది అఖండ 2 టీం. అలా చేయాలంటే మే, జూన్ లోపే షూటింగ్ ని పూర్తి చేయాలి. అందుకే టాకీ పార్ట్ నే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా తీసింది తీసినట్టు పూర్తి చేస్తూ రాకెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది ఫిల్మ్ టీం. ఇలా అనుకున్నట్టు జరిగితే కేవలం 4 నెలల్లో ఓ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ని పూర్తి చేసిన రికార్డు అఖండ 2 ఎకౌంట్ లో పడే ఛాన్స్ ఉంది.