ఒకే ఒక్కడు.. ఆ టాలీవుడ్ హీరో మీద 10,000 కోట్ల బిజినెస్.. దీనమ్మ ఇది కదా కిక్ అంటే..!
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు పెట్టి సినిమా తీయాలి అంటే 100 సార్లు ఆలోచించేవాళ్లు మన నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు కళ్ళు మూసుకొని 100 కాదు 500 కోట్లు పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు పెట్టి సినిమా తీయాలి అంటే 100 సార్లు ఆలోచించేవాళ్లు మన నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు కళ్ళు మూసుకొని 100 కాదు 500 కోట్లు పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు. మన సినిమాలకు 1000 కోట్లు కూడా వస్తుండడంతో.. నిర్మాతల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది. ఎంత బడ్జెట్ పెట్టినా వెనక్కి వస్తుందిలే అని ఒక గట్ ఫీలింగ్ తో ముందుగా ముందడుగు వేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో ఒక హీరో మీద ఏకంగా 10,000 కోట్ల బిజినెస్ చేస్తున్నారు నిర్మాతలు. హాలీవుడ్ లోనే అంత చేయరు కదరా బాబు.. మరి మన దగ్గర ఎవరి మీద అన్ని కోట్లు చేస్తున్నారు అనుకోవచ్చు..! కానీ ఇది ఒక సినిమా కోసం కాదు.. రాబోయే 5 సినిమాలకు కలిపి దాదాపు 3,000 కోట్ల బడ్జెట్.. 10 వేల కోట్ల బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అంత స్టామినా హీరో మన దగ్గర ఎవరున్నారబ్బా అనుకోవచ్చు..!
ఇంకెవరు.. మన భాయ్ అల్లు అర్జున్ లోనే అంత రేంజ్ చూస్తున్నారు మన నిర్మాతలు. పుష్ప సిరీస్ తో దాదాపు 2200 కోట్లు వసూలు చేసిన బన్నీ.. నెక్స్ట్ సినిమాలతో అంతకంటే భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై తాను చేసే ప్రతి సినిమా కనీసం 1500 కోట్లు వసూలు చేయాలి అనేది టార్గెట్ గా పెట్టుకున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఆయన ఎంచుకుంటున్న దర్శకులు కూడా అలాగే ఉన్నారు. ప్రస్తుతం అట్లితో ఒక సినిమా కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్ల వరకు ఉండబోతుంది. అందులో 300 కోట్లు బన్నీ రెమ్యూనరేషన్ మాత్రమే. అట్లీకి కూడా జవాన్ సినిమాతో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చింది. ఈ లెక్కన ఈ సినిమా హిట్ అయితే ఈజీగా 1500 కోట్లు క్రాస్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. కార్తికేయ స్వామి నేపథ్యంలో తెరకెక్కబోయే విజువల్ మైథాలజికల్ వండర్ ఇది. దీని బడ్జెట్ 400 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కుదిరితే రెండు భాగాలుగా ఈ సినిమా చేయాలని చూస్తున్నాడు బన్నీ. ఈ రెండు పార్ట్స్ గాని వర్కౌట్ అయితే కనీసం 2500 కోట్లకు మించి వసూలు చేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు ట్రేడ్ పండితులు.
దీని తర్వాత పుష్ప 3 ఉండబోతుంది. 2028లో ఖచ్చితంగా పుష్ప మూడవ భాగం విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే మాటిచ్చారు. పుష్ప 2 సినిమానే 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి నార్త్ లో ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే మెంటల్ వస్తుంది. ఇక పార్ట్ 3 వచ్చింది అంటే లెక్క మొదలవడమే 2000 కోట్లతో మొదలవుతుందేమో..! సుకుమార్ తర్వాత ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ కూడా అల్లు అర్జున్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో సందీప్ సినిమా ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ అయ్యింది కూడా. ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలు అంటే రేంజ్ మన ఊహకు కూడా అందదు. ఒక్కొక్కరికి 2000 కోట్లు వేసుకున్న తక్కువే ఉంటుందేమో. ఇలా బన్నీ నెక్స్ట్ లైన్ అప్ చూస్తుంటే మిగిలిన హీరోలకు వెన్నులో వణుకు పుడుతుంది. అట్లీ, త్రివిక్రమ్, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. ఇండియన్ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్స్ అందరూ బన్నీ లిస్ట్ లోనే ఉన్నారు. ఇవన్నీ వర్కవుట్ అయితే జస్ట్ ఇమాజిన్ 10 వేల కోట్లు కాదు.. అంతకు మించే వసూలు చేస్తాయి.