మళ్లీ పుష్పే గతా..? పుష్పరాజ్ రాకపోతే అడ్రస్ లేదా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే పాన్ ఇండియా లెవల్లో హిట్ పడ్డా, మరో మూవీ కోసం బిక్కుబిక్కుమంటూ భయంగా అడుగులేస్తున్న హీరో కావొచ్చు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే పాన్ ఇండియా లెవల్లో హిట్ పడ్డా, మరో మూవీ కోసం బిక్కుబిక్కుమంటూ భయంగా అడుగులేస్తున్న హీరో కావొచ్చు. ప్రభాస్ కి హిట్లేకాదు పంచ్ లు పడ్డ తన జర్నీలో భయం కనిపించలేదు. రాజమౌళి సాయం లేకుండా దేవరగా దుమ్ముదులిపిన ఎన్టీఆర్, తన మీద ఎంతగా యాంటీ ఫ్యాన్స్ అటాక్ జరిగినా తొణకలేదు. బెనకలేదు. ఆఖరికి ఆచార్య, గేమ్ ఛేంజర్ తో వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్న చరణ్ కూడా నిదానంగా, కమిటైన ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నాడు. ఎటొచ్చి బన్నీనే, కొత్త సినిమా అంటే వణికిపోతున్నాడు. త్రివిక్రమ్ కథ సిద్ధం చేసినా 6 నెలలు ఆగమన్నాడు. ఆట్లీతో రెండు సార్లు సినిమా చేయాలనుకుని, వెనకడుగు వేశాడు. ఇప్పుడు కథని ఫిక్స్ చేసుకునేందుకు దుబాయ్ లో తిష్టవేశాడు.. తర్వాత ఎవరితో సినిమాతీయలో తేలియక, మళ్లీ పుష్ప 3 జపమే చేస్తున్నాడు. ఆట్లీతో మూవీ అయిన వెంటనే పుష్ప3 పట్టాలెక్కాలని సుకుమార్ ని పట్టుబడుతున్నాడట. సుక్కు ఇప్పుడప్పుడే పుష్ప3 వద్దని చెప్పినా, తను వినట్లేదట… ఈ మ్యాటర్ బయటికొచ్చినప్పటి నుంచి, పుష్పరాజ్ గా ఉంటే తప్ప బన్నీకి భవిష్యత్తు లేదా? అన్న కౌంటర్లు పడుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మూడోసారి మారితే తప్ప తనకి మరో పాన్ ఇండియా హిట్ రాదా? లేదంటే రాదని తానే అనుకుంటున్నాడా? రీసెంట్ గా వస్తున్న గుసగుసలని బట్టి చూస్తే సుకుమార్ తో మరోసారి పుష్ప 3 మీద డిస్కర్షన్ నడిచిందట. కనీసం రెండు మూడేళ్ల వరకు పుష్ప3 జోలికి పోనని సుకుమారే తేల్చాడు.ఎందుకంటే ఏళ్ళకి ఏళ్లు వరుసగా పుష్ప జపమే చేస్తే,జనాలకి మొనాటని వస్తుంది. డైరెక్టర్ కూడా ఒకే పాయింట్ ని తిప్పి తిప్పి చెప్పబోతే, మ్యాటర్ కూడా డ్రై అయిపోతుంది. అందుకే ఏడాది బ్రేక్ తీసుకుని ఆతర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ తీసేందుకు ఫిక్స్ అయిపోయాడు సుకుమార్. అలాంటి తనని పుష్ప3 ని కూడా ప్లాన్ చేయమంటూ బన్నీ నుంచి కొన్ని రోజులుగా ప్రెజర్ పెరిగిందట.
ఇప్పటికిప్పుడే అని కాదు కాని, చరణ్ సినిమాకే బ్రేక్ వేసే ప్రయత్నం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రజెంట్ ఆట్లీతో సినిమా ప్లాన్ చేసిన బన్నీకి, ఎటు వెళ్లినా పంచ్ పడుతున్నట్టుంది. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలిని కలిస్తే, తను బన్నీని కాదని, లవ్ అండ్ వార్ మూవీలో రణ్ బీర్, ఆలియా, విక్కీ కౌశల్ ని తీసుకున్నాడు…సో బాలీవుడ్ ప్రయత్నాలు ఫలించలేదు. అందుబాటులో ఉన్న త్రివిక్రమ్ తో సినిమా చేద్దామంటే, తన మీద నమ్మకంలేదు. మాటల మాంత్రికుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీకి సపోర్ట్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ మీద ఫోకస్ తగ్గించాడనే కామెంట్లు కూడా పెరిగాయి…. ఆట్లీతో గీతా ఆర్ట్స్ లో ప్రాజెక్టు ప్లాన్ చేస్తే, ఆట్లీ డిమాండ్ లకు అల్లు అరవిందే భయపడే పరిస్థితి వచ్చింది.
ఫైనల్ గా సన్ ప్రొడక్షన్ లో ఆట్లీ, ఆల్లు అర్జున్ కాంబినేషన్ ఓకే అయ్యింది. దుబాయ్ లో ప్రజెంట్ స్టోరీ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. కాకపోతే ఈ సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ బన్నీకి లేదా? లేదంటే ఇది పోయినా వెంటనే తనని గట్టెక్కించేందుకు మరో సేఫ్ ప్రాజెక్టు కావాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడా? అందుకే సుకుమార్ ని పుష్ప3 కోసం ఇప్పటి నుంచే ప్రెజర్ చేస్తున్నాడనంటున్నారు.
ఆట్లీ మూవీ పూర్తి కాగానే సుకుమార్ తో పుష్ప3 మొదలవ్వాలనేది బన్నీ ప్లానింగ్ అనితెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్టు ఎనౌన్స్ చేసినా తను మాత్రం బన్నీ వైపు చూడట్లేదు. కారణం కూడా ఏంటో తేలట్లేదు.. ఏదేమైనా కొత్త పాన్ ఇండియా మూవీలకంటే, కలిసొచ్చిన పుష్ప కే మూడో సీక్వెల్ బెటరనే నిర్ణయానికి బన్నీ వచ్చాడనంటున్నారు.