జపాన్ ట్రైలర్ పేలింది.. కాని కల్కీ బాంబు భయపెడుతోంది…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ దేవర. ఆల్రెడీ థియేటర్స్ లో వచ్చింది 670 కోట్లు రాబట్టింది. ఇప్పుడు జపాన్ లో మార్చ్ 28 న రిలీజ్ కాబోతోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇండియన్ ఫ్యాన్సే కాదు,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 09:15 PMLast Updated on: Feb 28, 2025 | 9:15 PM

Intersting Facts About Devara And Kalki Movies In Japan

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ దేవర. ఆల్రెడీ థియేటర్స్ లో వచ్చింది 670 కోట్లు రాబట్టింది. ఇప్పుడు జపాన్ లో మార్చ్ 28 న రిలీజ్ కాబోతోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇండియన్ ఫ్యాన్సే కాదు, జపాన్ లోని తన అభిమానులకు కూడా పండగ చేసుకుంటున్నారు.కాని కల్కీ రూపంలో దేవరకి టెన్షన్ పెరిగింది. బేసిగ్గా బాహుబలి, త్రిబుల్ ఆర్ తో అక్కడ మనసినిమాల రేంజ్ ఏంటో తేలింది. తెలుగు వెలుగులు జపాన్ లో కూడా కనిపించటంతో, రజినీకాంత్ నే మించిన తెలుగు స్టార్స్ అన్న మాట తూటాలా పేలింది. అంతవరకు సంతోషమే , కాని కల్కీ వల్లే కంగారు పడాల్సి వస్తోంది. కల్కీ సినిమా వల్ల దేవర టీం ఆలోచనలో పడక తప్పేలా లేదు.. ఆల్రెడీ జపనీస్ లో దేవర ట్రైలర్ పేలింది. భారీ ఎత్తున స్పందన వస్తోంది. కాని ఎందుకు కల్కీ ని చూసి దేవర టీం కంగారుపడాల్సి వస్తోంది? హావేలుక్

దేవర మూవీ జపాన్ లో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ జపనీస్ లో లాంచ్ అయిన ట్రైలర్ పేలింది. యూ ట్యూబ్ లో దూసుకెళుతోంది. ఇక ఆన్ లైన్ లో జపాన్ ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ మాటా మంతితో అక్కడ ప్రమోషన్ మొదలైనట్టే కనిపిస్తోంది. మార్చ్ 28న జపాన్ లోరిలీజ్ అయ్యే దేవరకోసం మార్చ్ 22న టోక్యో బయలు దేరబోతున్నాడు తారక్..జపాన్ లో ఆరు రోజులు 8 నగరాల్లో దేవరని ఎన్టీఆర్ ప్రమోట్ చేయటం మ్యాటర్ కాదు… కల్కీనే అసలు సమస్య… ఆ సినిమానే దేవర టీంని కంగారు పెడుతోంది. అలాని కల్కీ మూవీ ఏం దేవరకి జపాన్ లో పోటీ ఇవ్వట్లేదు. అది ఆల్రెడీ, లాస్ట్ ఇయరే జపాన్ లోరిలీజ్ అయ్యింది. కాబట్టి దేవరకి కల్కీ పోటీ కాదు. ఎలా చూసినా ఆ సినిమానుంచి దేవరకి వచ్చిన ఇబ్బందేం లేదు.

కాకపోతే కల్కీ రిజల్టే కంగారుపెట్టిస్తోంది. జపాన్ అంటే మొన్నటి వరకు అది కేవలం తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అడ్డాలే. ముత్తు మూవీ నుంచి తనకి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాకపోతే పదేళ్ల క్రితం వచ్చిన బాహుబలి తో సీన్ మారింది. ప్రభాస్ కి బాహుబలి1, బాహుబలి 2 తో జపనీస్ లోక్రేజ్,అక్కడి మార్కెట్ లో మైలేజ్ పెరిగాయి.త్రిబుల్ ఆర్ కూడా ఏకంగా అక్కడ 2 బిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో 81 నుంచి 120 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇదే జపాన్ గడ్డ మీద ఓ మరో దేశపు సినిమా రాబట్టిన హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డు… కాకపోతే ఈరెండు కూడా రాజమౌళి తీసిన ఆణిముత్యాలే…

ఐతే ఇప్పుడు బాహుబలి, త్రిబుల్ ఆర్ జపాన్ కలెక్షన్స్ మీద చర్చ రావటానికి కారణం కల్కీ మూవీ. జపాన్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ కి, కల్కీ అక్కడ షాక్ ఇచ్చింది. అక్కడ లాస్ట్ ఇయర్ రిలీజైన ఈమూవీ కేవలం 8 మిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో 40 లక్షలే రాబట్టింది. సలార్ అయినా కనీసం 28 మిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో కోటిన్నర వరకు రాబట్టింది.అసలు ఇవి కలెక్షన్లే కావు.. అందుకే మరి దేవర పరిస్థితి ఎలా ఉంటుందా అన్న కంగారు కనిపిస్తోంది. త్రిబుల్ ఆర్ జోనర్ కి, దేవర మాస్ ఫ్లేవర్ కి వ్యత్యాసం ఉంది. మనదగ్గర మాస్ మార్కెట్ వేరు, జపాన్ జనాల టేస్ట్ వేరు. మరి వాళ్లకిది నచ్చుతుందా? నచ్చిదే దేవర2 కి ఇక పండగే… అలా కాకుంటే, కల్కీ 2ని జపాన్ లో రిలీజ్ చేయటం వద్దనుకున్నట్టే దేవర2ని అక్కడ రిలీజ్ చేయటానికి ఫిల్మ్ టీం వెనకడుగు వేసేఛాన్స్ఉంది.