మంచు మీద జారాడు.. 1000 కోట్ట మొహమాటమా..?
రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే డార్లింగ్... పాన్ ఇండియా కింగ్ అయినా డౌన్ టూ అర్త్ ఉంటాడు. నిజంగానే తన ప్రవర్తనలో ఎక్కడా కాస్తైనా గర్వం కూడా కనిపించదు. కాబట్టే తను అందరి డార్లింగ్ అయ్యాడు. అంతవరకు బానే ఉంది కాని, మరీ మంచితనం ఎక్కువైతేనే ప్రాబ్లమ్. అలా ఇప్పుడు అతి మొహమాటం రెబల్ స్టార్ కొంప ముంచుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే డార్లింగ్… పాన్ ఇండియా కింగ్ అయినా డౌన్ టూ అర్త్ ఉంటాడు. నిజంగానే తన ప్రవర్తనలో ఎక్కడా కాస్తైనా గర్వం కూడా కనిపించదు. కాబట్టే తను అందరి డార్లింగ్ అయ్యాడు. అంతవరకు బానే ఉంది కాని, మరీ మంచితనం ఎక్కువైతేనే ప్రాబ్లమ్. అలా ఇప్పుడు అతి మొహమాటం రెబల్ స్టార్ కొంప ముంచుతోంది. పాన్ ఇండియా కింగ్ గా మారాక కూడా తనలో పాత మొహమాటాలే ఇబ్బందు తెచ్చిపెడుతున్నట్టున్నాయి… ఆల్రెడీ మూడు సార్లు ఊహించని దెబ్బలు తగిలాయి. అయినా నాలుగోసారి మంచు మీద నడిచాడు.. కాలు జారినట్టుంది… అసలుకే ఎసరొచ్చింది. ఓ వైపు ది రాజా సాబ్ పూర్తి చేయాలి… ఫౌజీ కేవలం రెండు షెడ్యూల్సే పూర్తయ్యాయి. ఇంకా స్పిరిట్ మొదలు కాలేదు. కల్కీ 2 ప్లానింగ్ దశలోనే ఉంది. సలార్ 2 కూడా ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ఇలాంటి టైంలో మంచు మీద కాలు జారితే ఎలా…? ఈ గాయాల నుంచి రెబల్ స్టార్ ని కాపాడేదెవరు? టేకేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా మార్కెట్ కి మొగుడు, పాన్ ఇండియా సింహాసనాన్ని ఏలే కింగ్… అంతవరకు బానే ఉంది. కాని రాజులు సొమ్మ రాళ్ల పాలైనట్టు.. తన ఇమేజ్ ఇంకెవరో హీరో డ్యామేజ్ ని కవర్ చేయటానికి వాడేస్తున్నాడా..? స్నేహం, లేదంటే మొహమాటం… ఈరెండు కారాణాలతోనే తను మంచు విష్ణు మూవీ కన్నప్పలో కనిపిస్తున్నాడా..?
ఈ డౌట్లు రావటానికి రీజన్ కన్నప్పలో తన రుద్ర పాత్ర లుక్ వచ్చింది. రెబల్ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్ ని మంచు విష్ణు తెగా వాడేస్తున్నాడనే కామెంట్లు పేలుతున్నటైంలో, ఇలా ప్రభాస్ పోస్ట్ వచ్చింది. అది వచ్చాకే కామెంట్ల దాడి పెరిగింది. ప్రభాస్ ఏ లుక్కులోనైనా రాజసం ఉట్టి పడేలా కనిపిస్తాడు. అందుకే తను నటించకున్నా, కేవలం అలా నడిస్తే చాలు విజిల్స్ పడతాయంటారు.
అలాంటి కటౌట్ ని ఆగం ఆగం చేశారా? రుద్రుడి పాత్రలో ప్రభాస్ ని గెస్ట్ గా చూపించి, తన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అంతవరకు బానే ఉంది. కాని ఇక్కడ సమస్య ఏంటంటే, తన కి లాంగ్ హేయిర్ విగ్ కాని, లుక్ కాని నీరసంగా ఆదరా బాదరా సెట్ చేసినట్టుందనే కామెంట్లు పేలాయి.
నిజానికి ప్రభాస్ కరియర్ బిగినింగ్ లోకూడా ఇలానే కృష్ణవంశీ మీద గౌరవం తో చక్రం మూవీచేశాడు. వర్షం హిట్ ఇచ్చాడని ఎమ్మెస్ రాజు మూవీ పౌర్ణమిలో మెరిశాడు. ఇక చంద్రశేఖర్ ఏలేటి మీద గౌరవం తో తన టీం మెంబర్ రాధాకృష్ణ తో రాధేశ్యామ్ చేశాడు. ఇలా స్నేహం కోసమో లేదంటే, మొహమాటంతో నో చెప్పలేకో ప్రభాస్ ఇలా ఫెల్యూర్స్ ఫేస్ చేశాడు.
ఇలాంటి అనుభవాలున్నా, మంచు హీరో కోసం తను కన్నప్పలో గెస్ట్ రోల్ వేయటం కరెక్ట్ కాదన్నారు. సరే స్నేహం కోసం ఏదో చేస్తున్నాడనుకుంటే, తన లుక్కు, పాత్ర బాగుండాలి కదా… ఆగం ఆగం మేకింగ్, క్లారిటీ లేని టేకింగ్ వల్లే, ప్రభాస్ పాత్ర ఏదోలా వచ్చిందంటున్నారు. అదెంతవరకు నిజమోకాని, మోషన్ పోస్టర్ లో ప్రభాస్ లుక్కు బాగున్నా, తన జుట్టు మాత్రం అస్సలు బాలేదంటున్నారు. ఓవైపు ది రాజాసాబ్, ఫౌజీ సెట్లో ఉన్నాయి. స్పిరిట్, కల్కీ 2, సలార్ 2 సెట్స్ మీదకెళ్ళాయి.. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా తన డేట్లు కన్నప్ప టీం కి ఇస్తే సరిగా వాడుకోలేదా; ఫస్ట్ లుక్కే ఇలా ఉంటే, ఇక సినిమా ఎలా ఉంటుందో అన్న డౌట్లు పెరిగాయి.