ఉగాదికి స్పిరిట్ రుచి… వర్షాల్లో ఇక రక్తపాతమే…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ తో బిజీ అయ్యాడు. 20 రోజులు డెడికేటెడ్ గా ఆ సినిమా కోసమే కష్టపడుతున్నాడు. ఈలోపే సందీప్ రెడ్డి వంగ సీన్ లోకి ఎంటరవుతున్నాడు
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ తో బిజీ అయ్యాడు. 20 రోజులు డెడికేటెడ్ గా ఆ సినిమా కోసమే కష్టపడుతున్నాడు. ఈలోపే సందీప్ రెడ్డి వంగ సీన్ లోకి ఎంటరవుతున్నాడు. ఫౌజీ షూటింగ్ పూర్తయ్యే వరకు స్పిరిట్ జోలికి పోనన్న తను, సడన్ గా మనసుమార్చుకున్నాడు. రెబల్ స్టార్ ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సో ప్రభాస్ ఫౌజీలో సోల్జర్, అలానే స్పిరిట్ లో పోలీస్.. కాబట్టి కటింగ్, క్లీన్ షేవ్ విషయంలో రూల్స్ సేమ్… కాబ్టటే ఇక్కడ ఒకేసారి ఫౌజీ, స్పిరిట్ రెండీంటిని తీయొచ్చా? కాని సందీప్ రెడ్డి వంగ క్లియర్ కట్ గా కండీషన్ పెట్టాడు. తన మూవీ కమిటైతే, ప్రభాస్ మరో సినిమా ప్యార్ లల్ గా చేయకూడదనేదే కండీషన్. కట్ చేస్తే ఇప్పుడు ఉగాదికి రెబల్ పండగ వచ్చేలా ఉంది.. ఫౌజీ షూటింగ్ సగం కాదు కదా, కనీసం పావు వంతు కూడా షూటింగ్ జరగలేదు. ఇలాంటప్పుడు స్పిరిట్ ని సందీప్ రెడ్డి ఎందుకు లాంచ్ చేస్తున్నట్టు…? అదెలా సాధ్యం..? ఇంతకి ఉగాది పండక్కి ప్రభాస్ కొత్త లుక్ రివీల్ అవుతుందా? హావేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్ ఉగాదికి తన ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. నిజంగానే తెలుగు వాళ్లకి న్యూఇయర్ అయిన యుగాదే ఉగాది… అలాంటి పండక్కి పరమాన్నం లాంటి న్యూస్ ఇన్ ఇస్తున్నాడు రెబల్ స్టార్. ఇక ఫ్యాన్స్ లోపూనకాలు తెప్పించేలా స్పిరిట్ మూవీ అప్ డేట్ ని రెడీ చేశాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ చేసే సినిమా స్పిరిట్, ఎగ్జాక్ట్ గా ఉగాది రోజే లాంచ్ కాబోతోంది.
మార్చ్ 30 న ఉదయం సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ లాంచ్ కాబోతోంది. ఫస్ట్ టైం పోలీస్ పాత్ర వేయబోతున్న ప్రభాస్, ఈసినిమా లో తన లుక్ మార్చుకోవాలంటే, ముందు కమిటైన ది రాజా సాబ్, ఫౌజీ మూవీలు పూర్తిచేయాలి. అలా కాకుండా ఒక సినిమా తోపాటు మరో మూవీని ప్యార్ లల్ గా చేస్తానంటే కుదరదని సందీప్ రెడ్డి ఎప్పుడో తేల్చాడు
ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి కండీషన్ కి అగ్రీ అయ్యాడు. అలాంటప్పుడు ఉగాదికి అంటే మార్చ్ 30 కే స్పిరిట్ ని లాంచ్ చేస్తే ఎలా? ది రాజా సాబ్ వచ్చేనెల 30 లోపు పూర్తవుతుందేమోకాని, ఫౌజీ మాత్రం ఇప్పడప్పుట్లో పూర్తి కాదు. పావు శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు కాబట్టి, ఈలోపే స్పిరిట్ ని లాంచ్ చేస్తే ఒకేసారి రెండు సినిమాలంటే, సందీప్ రెడ్డి కండీషన్ కి అర్ధం ఉండదు
ఐతే అక్కడే ట్విస్ట్ ఉంది. ఉగాదికి స్పిరిట్ మూవీ లాంచ్ అవుతుంది. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. కాని రెబల్ స్టార్ మాత్రం జూన్ లోనే ఈ సినిమా సెట్లో అడుగుపెడతాడు. అప్పటి వరకు హను రాఘవపూడీ ఫౌజీ మూవీ షూటింగ్ ని పూర్తి చేసే ఛాన్స్ఉంది. సో జూన్ ఎండ్ లేదంటే జులై స్టార్టింగ్ లో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుంది
నిజానికి స్పిరిట్ మూవీ లాంచ్ ని సంక్రాంతికే ప్లాన్ చేశారు. తర్వాత సందీప్ రెడ్డి వంగనే ఆ లాంచింగ్ ముహుర్తాన్ని ఉగాదికి మార్చాడు. దానికి పరోక్షంగా ప్రభాస్ మోకాలి చికిత్సే కారణం కూడా అయ్యుండొచ్చు. ఏదేమైనా ఉగాదికి స్పిరిట్ మూవీని లాంచ్ చేయటమే కాదు, వెనక్కి తిరిగి ఉన్న ప్రభాస్ లుక్ తో పోస్టర్ ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ పోస్టరే ఉగాది రోజు మోషన్ పోస్టర్ రూపంలో లాంచ్ చేస్తారట.