మొగుడ్ని హీరో చేసేదాకా వదిలేలా లేదుగా.. కీర్తి సురేష్ ప్లాన్ ఏంటి..?
ఏ హీరోయిన్ అయినా పెళ్ళికి ముందు గ్లామర్ షో చేస్తుంది.. పెళ్లి తర్వాత కాస్త హద్దుల్లో ఉంటుంది. కానీ కీర్తి సురేష్ మాత్రం రివర్స్. పెళ్లికి ముందు ఈమె చాలా హద్దుల్లో ఉండేది..

ఏ హీరోయిన్ అయినా పెళ్ళికి ముందు గ్లామర్ షో చేస్తుంది.. పెళ్లి తర్వాత కాస్త హద్దుల్లో ఉంటుంది. కానీ కీర్తి సురేష్ మాత్రం రివర్స్. పెళ్లికి ముందు ఈమె చాలా హద్దుల్లో ఉండేది.. గ్లామర్ షోకు కూడా దూరంగానే ఉండేది. ఎన్ని సినిమాలు చేసినా కూడా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఒక గిరి గీసుకొని అందులోనే ఉండిపోయింది ఈ భామ. కానీ అలా పెళ్లి సెట్ అయిందో లేదో తన మైండ్ సెట్ కూడా మార్చేసుకుంది కీర్తి సురేష్. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈమెలోని మరో యాంగిల్ బయటకు వచ్చింది. అప్పటి వరకు ఎవరూ చూడని గ్లామర్ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియాను తన వెంట తిప్పుకుంటుంది కీర్తి సురేష్.
బేబీ జాన్ సినిమా కోసం ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిన కీర్తి.. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి సెన్సేషనల్ ఫోటోషూట్స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లికి ముందు అసలు ఆంటోనీ అంటే ఎవరూ కూడా ఎవరికి తెలియదు. కానీ ఒక్కసారి కీర్తి సురేష్ తో పెళ్లి అయిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఆంటోనీ తట్టిల్ పేరు బాగా వినిపిస్తుంది. భార్యకు ఉన్న ఇమేజ్ వాడుకుంటూ ఇండస్ట్రీలో బాగా పరిచయాలు పెంచుకుంటున్నాడు ఆంటోనీ. ఈయన తీరు, జోరు చూస్తుంటే త్వరలోనే హీరో అయిపోతాడేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో భార్యతో కలిసి అదిరిపోయే ఫోటోషూట్లకు ఫోజులు ఇస్తున్నాడు ఆంటోనీ.
తాజాగా వీళ్ళిద్దరూ గోవాలో పార్టీ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో పార్టీ వేర్ లో కీర్తి సురేష్ మరోసారి గ్లామర్ షోలో అదరగొట్టింది. ఇక ఆంటోనీ కూడా హీరో మెటీరియల్ లా ధగధగా మెరిసిపోతున్నాడు. తనకున్న పరిచయాలతో భర్తను హీరో చేయడం అనేది కీర్తి సురేష్ కు పెద్దగా కష్టమైన పనేమీ కాదు. ప్రస్తుతం ఈమె ప్లానింగ్ కూడా ఇదే అని తెలుస్తోంది. అన్నీ కుదిరితే రాబోయే రెండేళ్లలో కీర్తి హస్బెండ్ కచ్చితంగా హీరోగా పరిచయం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అది సొంత ఇండస్ట్రీ మలయాళంలో చేస్తుందా లేదంటే పరిచయాలు వాడుకుని పక్కనే ఉన్న తమిళం, తెలుగు ఇండస్ట్రీ వరకు మొగుడిని తీసుకొస్తుందా అనేది చూడాలి.