ఎన్టీఆర్ ఇక్కడ కొడితే… సౌండ్ ఉదర్ ఆతా… కింగ్ డమ్ తగలబడుతోంది… !
ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ లానే కాలం కలిసొస్తే ఈ పాటికి పాన్ ఇండియాని ఏలేవాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సౌత్ మొత్తం ఫోకస్ అయ్యాడు.

ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ లానే కాలం కలిసొస్తే ఈ పాటికి పాన్ ఇండియాని ఏలేవాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సౌత్ మొత్తం ఫోకస్ అయ్యాడు. పాన్ ఇండియా మూవీ చేయకున్నా, ఆరేంజ్ లో దేశవ్యాప్తంగా తనకి గుర్తింపుదక్కింది. కాని లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్లు… స్టేజ్ మీద అతిగా వదిలే మాటల తూటాలే ఈ హీరో కొంపముంచాయి… కట్ చేస్తే ఇప్పడు మాస్ కింగ్ డమ్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చాడు. తన సాయం తీసుకున్నాడు. ఇక్కడ తారక్ డైలాగ్ విసిరితే, రీసౌండ్ నార్త్ లో వస్తోంది. కెరీర్ దూసుకెళ్లే టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట సాయం చేస్తే, కష్టకాలంలో ఎన్టీఆర్ ఏకంగా మాటల మంత్రమే వేశాడు… దెబ్బకి కింగ్ డమ్ గొప్పగా తగలబడిపోతోంది… ఈసారి రౌడీ దాడిలో విచిత్రం ఏదో జరిగేలా ఉంది…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట సాయం చేశాడు. గొంతు అరువిచ్చాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కోసం వాయిస్ ఓవర్ చెప్పాడు. దేవర, జై లవకుశ రేంజ్ లో తన డైలాగ్స్ భారీగా పేలాయి. విచిత్రం ఏందంటే విజయ్ దేవరకొండ మూవీ కింగ్ డమ్ కోసం, తమిల్ లో హీరో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.. కాని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ భారీగా పేలింది. సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ వస్తోంది.సౌత్ సంగతి ఎలా ఉన్నా నార్త్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కి జనాలు ఫిదా అయినట్టున్నారు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ టీజర్ కి, తను చెప్పి వాయిస్ ఓవరే వణికించేలా ఉందంటూ,కంపేర్ చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్ కంటే తారక్ వాయిస్ ఓవర్ కే ఎక్కువ మార్కులేస్తు పోలికలతో షాక్ ఇస్తున్నారు. హిందీ వాళ్లకోసం హిందీ హీరో, తమిళ జనం కోసం సూర్య, తెలుగు ఆడియన్స్ కోసం ఎన్టీఆర్ ఈ మూవీ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు..
ఇదేం వాళ్ల సినిమా కాదు… రౌడీ స్టార్ విజయ్ మూవీనే… అలాంటప్పుడు ఒకరి వాయిస్ ఓవర్ తో మరొకర్ని పోల్చాల్సిన పనిలేదు. కాని ఎందుకో ఎన్టీఆర్ ఇక్కడ డైలాగ్ విసిరితే, నార్త్ లో రీసౌండ్ రాకుండా ఉండట్లేదు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని కాదు కాని, ఈ కంపేరిజన్ వల్ల కింగ్ డమ్ మూవీకి నార్త్ లో మంచి రీచ్ కనిపిస్తోంది. ఆ విషయం సోషల్ మీడియాలో రెస్పాన్స్ బట్టి తేలుతోంది.
ఇక విజయ్ విషయానికొస్తే, ఖుషీ, ఫ్యామిలీ స్టార్, లైగర్ ఇలా వరకుసగా డిజాస్టర్ మీద డిజాస్టర్ పడింది. ఏదో అద్భుతాలు కాకుండా జస్ట్ యావరేజ్ హిట్టో, కాలం కలిసొస్తే మంచి హిట్టో తనకి పడితే చాలానే పరిస్థితి వచ్చింది. ఐతే గతంలో గీతా గోవిందం టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ ని ఆకాశానికెత్తి, మాట సాయం చేశాడు.
ఇప్పడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పి, విజయ్ కింగ్ డమ్ టీజర్ కి పాన్ ఇండియా లెవల్లోబజ్ తీసుకొచ్చాడు .మరి ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ టీజర్ బాగా రీచ్ అయినట్టుంది. విచిత్రం ఏంటంటే కింగ్ డమ్ హిందీ వర్షన్ కి హిందీ హీరో చెప్పిన వాయిస్ ఓవర్ కంటే, తెలుగులో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవరే, నార్త్ లోరీసౌండ్ చేయటం షాకింగ్ గా ఉంది.