ఎన్టీఆరే కాపాడేశాడా..? గొంతు సవరిస్తే 3 మిలియన్ డాలర్లు..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే, దాని పవర్ 40 కోట్లని తేలింది. కేవలం అంటే కేవలం తను వాయిస్ ఓవర్ చెబితేనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఓవర్ సీస్ మార్కెట్ మతిపోయేలా జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2025 | 04:00 PMLast Updated on: Feb 17, 2025 | 4:00 PM

Intersting Facts About Kingdom Movue

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే, దాని పవర్ 40 కోట్లని తేలింది. కేవలం అంటే కేవలం తను వాయిస్ ఓవర్ చెబితేనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఓవర్ సీస్ మార్కెట్ మతిపోయేలా జరిగింది. టీజర్ రాకముందు ఈ మూవీ కింగ్ డమ్ కి ఓవర్ సీస్ రైట్స్ హాఫ్ మిలియన్ కూడా డీల్ సెట్ కాలేదు. టీజర్ వచ్చాక మాత్రం ఏకంగా 5 మిలియన్ల వరకు కింగ్ డమ్ మూవీకి ప్రీరిలీజ్ బిజినెస్ ఫైనలయ్యేలా ఉంది. ఓవర్ సీస్ లోనే ఈ పరిస్తితి కేవలం తెలుగు వర్షన్ కే కనిపిస్తోంది. హిందీ, తమిళ్ వర్షన్ ఓవర్ సీస్ రైట్స్ ఇంకా డిస్కర్షనే మొదలు కాలేదు. అంతలోనే తెలుగు వర్షన్ కి ఓవర్ సీస్ రైట్స్ 5 మిలియన్ డాలర్లను రీచ్ అయ్యేలా ఉన్నాయి. నిజానికి కింగ్ డమ్ టీజర్ మరో దేవర అనంటున్నారు. చూసిన మూవీనే చూపిస్తారా అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. కాని ఎన్టీఆర్ పుణ్యమాని, తన వాయిస్ఓవర్ దెబ్బతో ఏకంగా 4 కోట్ల డీల్ కూడా సెట్ కాని ప్లేస్లో 40 కోట్లు వెనకేసుకునే చాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకి కింగ్ డమ్ నిజంగా మరో దేవరనేనా? టేకేలుక్

కేవలం ఒక చిన్న వాయిస్ ఓవర్ నిజంగా కోట్లల్లో మ్యాటరా..? వింటానికి కాస్త అతిశయోక్తి అనిపించొచ్చు.. కాని రియాలిటి చెక్ చేస్తే అంతా షాక్ అవ్వాల్సి వస్తోంది. ఎందుకంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసినే కింగ్ డమ్ మూవీ టీజర్ హిందీలో పేలలేదు. తమిల్ లో వైరల్ కాలేదు. కాని తెలుగు వర్షన్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఎన్టీఆర్ వాయిస్ఓవర్ చెప్పటం వల్లే అలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే పర్లేదు.. కాని తను వాయిస్ఓవర్ చెప్పినంత మాత్రాన కింగ్ డమ్ మూవీ ఓవర్ సీస్ రైట్స్ పెరుగుతాయా? అంటే పెరిగాయి…ఫినాన్సియల్ గా జరుగుతున్న డీల్స్ చూస్తే ఇది నిజమే అనిపించేలా ఉంది. ఎందుకంటే విజయ్ మూవీ కింగ్ డమ్ తెలుగు వర్షన్ సంబంధించి,యూఎస్ ప్రీరిలీజ్ బిజినెస్ 2 మిలియన్లైతే, యూకే, ఆస్ట్రేలియా, ఇలా టోటల్ ఓవర్ సీస్ రైట్స్ 5 మిలియన్ డాలర్లకు డీల్ ఓకే అయ్యిందట. అంటే విజయ్ కెరీర్ లోనే ఒక సినిమా ఓవర్ సీస్ రైట్స్ 5 మిలియన్లంటే, మన కరెన్సీలో 40 కోట్లకు సమానం..

ఇంత భారీగా తన సినిమాలేవీ ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకోలేదు. విచిత్రం ఏంటంటే కింగ్ డమ్ తెలుగు వర్షన్ ఓవర్ సీన్స్ రైట్సే 5 మిలియన్లు… తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఓవర్ సీస్ రైట్స్ ఎంతకు సేల్ అవుతాయో ఇంకా తేలలేదు. ఎలాంటి డీల్ జరగలేదు.. ఇక కింగ్ డమ్ మూవీ టీజర్ చూస్తే కూడా, ఇది మరో దేవర, లేదంటే మరో పుష్పరాజ్ అనిపించేలా ఉందన్నారు. తన జనం కోసం ఫైట్ చేసే ఓ యోధుడు, తన సమాజమే తన కింగ్ డమ్ అనేలా కంటెంట్ ఉంటుందని, టీజర్ చూసి అంచనా వేస్తున్నారు. బీచ్ విజువల్స, అడవుల్లో జనాలు , జైల్లో పరిస్థితులు ఇవన్నీ, కాస్త పుష్ప ఇంకాస్త దేవరని గుర్తుచేస్తున్నాయనే కామెంట్లు పెరిగాయి

ఆల్రెడీ వచ్చి వండర్స్ చేసిన సినిమాల దారిలోనే వెలితే, కాపీ కామెంట్లు, లేదంటే ట్రెండ్ ఫాలోవర్ అంటూ స్టాంపులు పడిపోతాయి. ఎవరేమనుకున్నా, విజయ్ దేవరకొండకి ఖుషీ, లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి డిజాస్టర్లు పడ్డాక, సాలిడ్ కమ్ బ్యాక్ అవసరమైంది. కుదిరితే ఒక హిట్టు, లేదంటే బ్లాంక్ బస్టర్ వస్తే చాలు..మరీ ట్రెండ్ సెట్టింగ్ అర్జున్ రెడ్డి రేంజ్ కల్ట్ మూవీ పడకున్నా పర్లేదు. ఇది తన పరిస్తితి.. అలాంటి దుస్తితిని ఫేస్ చేసుకున్న తనకి, కింగ్ డమ్ మూవీ తెలుగు ఓవర్ సీస్ రైట్సే 40 కోట్లు పలికాయంటే అద్భుతమే.. ఆ అద్భుతానికి కారణం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనక తప్పట్లేదు. ఎందుకంటే తమిళ్, హిందీ వర్షన్ కి పెద్దగా రెస్పాన్స్ కాని, ఓవర్ సీస్ రైట్స్ కోసం క్యూలు కాని కనిపించట్లేదు. ఓన్లీ తెలుగు వర్షన్ కే డిమాండ్ కనిపిస్తోంది. ఇక సినిమా లో చాలా చోట్ల ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడనే ప్రచారం కూడా ఈసినిమా ప్రిరిలీజ్ బిజినెస్ ని పెంచేలా ఉంది.