ఆ డైరెక్టర్ దెబ్బకి బిచ్చగాడిగా మారిపోయిన స్టార్ హీరో..!

ధనుష్ అంటే ఒకప్పుడు తమిళ హీరో.. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్యాన్ ఇండియన్ హీరో. అన్ని భాషల్లో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకులు రెడీగా ఉంటున్నారు. పైగా ఆయన కూడా దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 07:30 PMLast Updated on: Feb 24, 2025 | 7:30 PM

Intersting Facts About Kubera

ధనుష్ అంటే ఒకప్పుడు తమిళ హీరో.. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్యాన్ ఇండియన్ హీరో. అన్ని భాషల్లో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకులు రెడీగా ఉంటున్నారు. పైగా ఆయన కూడా దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. అంత బిజీగా ఉండి కూడా అన్ని భాషలకు అందుబాటులో ఉండడం నిజంగా ధనుష్ గొప్పతనమే. తెలుగులో సార్ సినిమాతో ఇప్పటికే సూపర్ హిట్ అందుకున్న ఈయన.. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మొదలైన షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఏదైనా సమస్య ఉందా అంటూ అందరూ ఆరా తీస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా శేఖర్ కమ్ముల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుబేర అనే టైటిల్ తను ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశానని.. ఇప్పుడు తమ టైటిల్ శేఖర్ కమ్ముల కాపీ కొట్టాడు అంటూ కర్మికొండ నరేంద్ర అనే నిర్మాత ఇప్పటికే ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సినిమా ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణమే అయ్యుండొచ్చు అని ప్రచారం జరుగుతుంది. శేఖర్ కమ్ముల సినిమా ప్రకటించిన తర్వాత సార్, కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాలు పూర్తి చేశాడు ధనుష్. కానీ వాటన్నింటి కంటే ముందు మొదలుపెట్టిన కుబేర మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

ఈ సినిమాలో నాగార్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా కథ విషయానికి వస్తే ముంబైలోని ధారావిలో ఒక బిచ్చగాడిగా ఉండే హీరో.. వేల కోట్లు ఎలా సంపాదించాడు అనేది కథ. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్, టీజర్ లో ధనుష్ బిచ్చగాడు లుక్ బాగా హైలైట్ అయింది. అంతేకాదు లక్ష్మీదేవి ముందు ధనుష్ నిలబడిన ఫోటో కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక బెగ్గర్ ఎలా మిలియన్లు సంపాదించాడని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చే ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కచ్చితంగా ధనుష్ కెరియర్ లోనే కాదు శేఖర్ కమ్ముల కెరీర్లో కూడా నెంబర్ వన్ సినిమా అవుతుందని బలంగా చెబుతున్నారు మేకర్స్. మరి వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అనేది చూడాలి.