మిడిల్ ఫింగర్ చూపించిన విశ్వక్సేన్.. నందమూరి ఫ్యాన్స్ కాపడతారనే ధీమానా…?

రీసెంట్ గా 30 ఇయర్స్ పృద్వి చేసిన కామెంట్స్ లైలా సినిమాకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫ్యాన్స్ ఈ సినిమాను గట్టిగానే టార్గెట్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 01:30 PMLast Updated on: Feb 14, 2025 | 1:30 PM

Intersting Facts About Laila Movie

రీసెంట్ గా 30 ఇయర్స్ పృద్వి చేసిన కామెంట్స్ లైలా సినిమాకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫ్యాన్స్ ఈ సినిమాను గట్టిగానే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో దీనిపై ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని చాలామంది వైసిపి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. ఈ సినిమాపై విశ్వక్సేన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రీసెంట్ గా నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాను ఎలాగైనా సరే గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రమోషన్స్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విశ్వక్సేన్ ఎప్పుడు లేని విధంగా లేడీ గెటప్ లో కూడా నటించాడు. దాదాపుగా హీరోలు లేడీ గెటప్ లో నటించిన సినిమాలన్నీ హిట్ అవుతూ ఉంటాయి. ఇక విశ్వక్సేన్ కూడా ఇప్పుడు అదే సాహసం చేశాడు. దీనితో సినిమా ఎలాగైనా సరే హిట్టు కొడుతుందని అతని ఫాన్స్ కూడా ధీమాగా ఉన్నారు. అయితే సినిమా ఈవెంట్లో 30 ఇయర్స్ పృద్వి చేసిన కామెంట్స్ తో సినిమా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో విశ్వక్సేన్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు.

అయితే విశ్వక్సేన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫోటోలో మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇంస్టాగ్రామ్ స్టోరీ గా దాన్ని అప్లోడ్ చేసాడు. దీనితో ట్రోలింగ్ ను అతను లైట్ తీసుకున్నాడు అనే ఒపీనియన్ వినపడుతోంది. ముందు అతను కాస్త భయపడి క్షమాపణ చెప్పినా… తర్వాత తనని ఏం చేయలేరు అనే క్లారిటీలో అతను ఉన్నాడని… కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ అయితే అతనికి కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నారు. దీనితో వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూస్తే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది.

అందుకే లైట్ తీసుకున్నాడని కొంతమంది అంటున్నారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోసం అతను ట్రై చేయడం దానికి తోడు గతంలో నందమూరి బాలకృష్ణ తో అతను ఫ్రెండ్లీగా ఉండటం వంటివి అతని కాస్త ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నందమూరి ఫ్యాన్స్ కి అతను దగ్గర అయ్యాడు. ఇప్పుడు చిరంజీవి ద్వారా మెగా ఫాన్స్ కు కూడా ఎంతో కొంత దగ్గరవుతున్నాడు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ అతన్ని ఇబ్బంది పెట్టినా సినిమాపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదు. ఈ మధ్యకాలంలో యాంటీ ఫ్యాన్స్ ప్రభావం పెద్దగా ఉండటం లేదు. వాళ్లు సినిమాను టార్గెట్ చేసిన సరే రిజల్ట్ పై కాస్తో కూస్తో ప్రభావం ఉన్న సినిమాను ఫ్లాప్ చేసే అంత సీన్ అయితే లేదని చెప్పాలి. మరి ఈ సినిమాతో విశ్వక్సేన్ హిట్టు కొట్టేసి ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.