తీన్మార్ సాంగ్… 500 మంది డాన్సర్స్… 55 కోట్ల సెట్లో 6 రోజులు

ముంబై ఫిల్మ్ స్టూడియోలో మెరుపులు మొదలయ్యాయి.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి డాన్స్ చేస్తారా అని అంతా వేయిట్ చేస్తుంటే, సెట్లో అడుగుపెట్టారీ ఇద్దరు సూపర్ డాన్సర్స్...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 08:00 PMLast Updated on: Mar 05, 2025 | 8:00 PM

Intersting Facts About Ntr And Hrithik Roshan Movie

ముంబై ఫిల్మ్ స్టూడియోలో మెరుపులు మొదలయ్యాయి.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి డాన్స్ చేస్తారా అని అంతా వేయిట్ చేస్తుంటే, సెట్లో అడుగుపెట్టారీ ఇద్దరు సూపర్ డాన్సర్స్… హ్రితిక్ అంటేనే స్మూత్ మూమెంట్స్… ఎన్టీఆర్ అంటేనే పక్కా మాస్ డాన్స్ స్టెప్స్..అలాంటి వీళ్ల కాంబినేషన్ లోసాంగ్ అంటే సెన్సేషన్ అవ్వాల్సిందే.. ఆ పాటే ఇప్పుడు ముంబై స్టూడియోలో 55 కోట్ల ఖర్చుతో వేసిన భారీ సెట్లో తెరకెక్కుతోంది. ఫైనల్ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఫిల్మ్ టీం బిజీ అయ్యింది. ఏకంగా 500 మంది డాన్స్ మాస్టర్లే సైడ్ డాన్సర్లుగా మారారు. ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 సినిమాకు, స్పెషల్ డెకరేషన్ ని ఈ సెన్సేషనల్ సాంగ్ తో యాడ్ చేస్తున్నారు.. అయితే ఈ పాటలో సౌత్ మొత్తం ఊగిపోయే ట్విస్ట్ పెట్టింది ఫిల్మ్ టీం. ఆల్రెడీ సాంగ్ షూటింగ్ మొదలవ్వటంతో ఆ ట్విస్ట్ కూడా లీకైంది… అందుకే సెట్లో హీరోల డాన్స్ కంటే ఈ లీకేజే ఫిల్మ్ టీం ని షాక్ కి గురిచేసింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషణ్ సెట్లో తీన్మార్ వేశారు. వేస్తున్నారు.. ఇంకా ఈ వారం అంతా వేస్తూనేఉంటారు. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో వార్ 2 సాంగ్ షూటింగ్ మొదలైంది. 55 కోట్ల ఖర్చుతో వేసిన భారీ సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఏకంగా 500 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు.డాన్సర్స్ అంటే ఏదో జూనియర్స్ ని పెట్టి ఈ పాట షూటింగ్ చేయట్లేదు. 500 మంది డాన్సర్స్ అంతా ఆల్ మోస్ట్ జూనియర్ డాన్స్ మాస్టర్లే అనితెలుస్తోంది. బాలీవుడ్ లో ధూమ్ నుంచి బంటీ ఔర్ బబ్లీ వరకు ఎన్నో ఐకానిక్ సాంగ్స్ కి కొరియోగ్రాఫి చేసిన బాస్కో మార్టిస్ ఈ సాంగ్ కి కొరియోగ్రాఫీ చేశాడు. ప్రీతమ్ అందించిన సాంగ్ కి ప్రెజెంట్ ఎన్టీఆర్,హ్రితిక్ డాన్స్ చేస్తున్నారు.

వార్ మూవీలో కూడా హ్రితిక్ రోషన్ తో టైగర్ ష్రాఫ్ దుమ్ముదులిపే పాటకి డాన్స్ చేశాడు. కాకపోతే తనది జిమ్మాస్టిక్ డాన్స్ స్టైల్… హ్రితిక్ ది వెస్టర్న్ స్మూత్ డాన్స్… ధూమ్ నుంచి లక్ష్యాలో మై ఏసా క్యూహూ వరకు బాలీవుడ్ లో డాన్స్ అంటే హ్రితికే అనిపించుకున్నాడు. అలాంటి తనకి ఎన్టీఆర్ గట్టిగానే షాక్ ఇస్తున్నాడు. ఎందుకంటే మాస్ డాన్స్ కి, స్పీడ్ డాన్స్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ కేరాఫ్ అడ్రస్. ఆవిషయంలో ఎన్టీఆర్ కి పోటీ ఇవ్వటం కష్టం.. కాకపోతే క్లాస్ అండ్ స్మూత్ మూవ్స్ కి మాత్రం హ్రితిక్ కేరాఫ్ అడ్రస్.. అలాంటి ఈ ఇద్దరు దిగ్గజ డాన్సింగ్ స్టార్స్ డాన్స్ చేస్తుంటే సైడ్ డాన్సర్స్ కూడా అందుకు తగ్గట్టే ఉండాలి. కాబట్టే జూనియర్ డాన్సర్లనుకాకుండా జూనియర్ డాన్స్ మాస్టర్లనే రంగంలోకి దింపారు. వాళ్లకి వీళ్లకి తేడా ఏంటంటే, ప్రతీ పాటని కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తే ఇద్దరు జూనియర్ డాన్స్ మాస్టర్లు ఆ సాంగ్ స్టెప్స్ని మిగతా డాన్సర్స్ ని నేర్పిస్తారు.

అలాంటి జూనియర్ డాన్స్ మాస్టర్లనే ఏకంగా 500 మందిని తీసుకుని 55 కోట్ల ఖర్చుతో వేసిన సెట్లో 6రోజుల్లో షూటింగ్ పూర్తి చేయబోతోంది వార్ 2 టీం. ఐతే ఈ పాటలో హ్రితిక్ కి సెపరేట్ ట్రాక్, ఎన్టీఆర్ కి సెపరేట్ ట్రాక్ తోపాటు మూమెంట్స్ ని కంపోజ్ చేశారట. ఆ స్టెప్స్ నే ఓ జూనియర్ డాన్సర్ తన ఇన్ స్టా గ్రామ్ లో డాన్స్ చేసి పెట్టడంతో, పాటలో మూమెంట్స్ లీకైనట్టే అనంటున్నారు. ఐతే ఆ మూమెంట్స్ పుణ్యమాని, ఇప్పుడు ఈ సాంగ్ ఎంత ఎలక్ట్రిఫైయ్యింగా ఉందో జనాలకు అర్ధమైంది. ఎందుకో వార్ 1 లో హ్రితిక్, టైగర్ ష్రాఫ్ డాన్స్చేస్తే అందులో హ్రితిక్ డామినేషనే కనిపించింది.వార్ 2 సాంగ్ షూటింగ్ లో మాత్రం ఎన్టీఆర్ డాన్స్ డామినేషనే ఉన్నట్టు ఆ లీకైన స్టెప్ తో తెలుస్తోంది.