ఉగాదికి 1000 కోట్ల బొమ్మ… లేదంటే… స్వీట్ వార్నింగ్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడన్ గా ఫైర్ అయ్యారు. అవుతున్నారు. ఇంకా అవుతూనే ఉండేలా ఉన్నారు. దానికి కారణం ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2025 | 04:27 PMLast Updated on: Feb 10, 2025 | 4:27 PM

Intersting Facts About Ntr Movies

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడన్ గా ఫైర్ అయ్యారు. అవుతున్నారు. ఇంకా అవుతూనే ఉండేలా ఉన్నారు. దానికి కారణం ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2. దేవర లాంటి సినిమా అంత టైం తీసుకుని తీసినా, రైట్ టైం కి అప్ డేట్స్ ఇచ్చాడు కొరటాల శివ. అలాంటిది వార్ 2 మూవీ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లోకొచ్చినా ఇంతవరకు టీజరో, ప్రోమోనో కాదుకదా, కనీసం మోషన్ పోస్టర్ లేదు. ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో, కనీసం అది కూడా రివీల్ కాలేదు. దీంతో ఎట్టిపరిస్థితుల్లో అప్ డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఆ సినిమా నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇదిప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుందనుకుంటే, అసలు ఈ టోటల్ సినారియో చూసి బాలీవుడ్ బిత్తరపోతుంది.. అక్కడ ఇలాంటి ట్రెండే కనిపించదు. ఫ్యాన్స్ ఈరేంజ్ లో ప్రొడ్యూసర్స్ కి మాస్ మార్నింగ్ ఇచ్చే అభిమానం అక్కడి హీరోలకు ఛాన్సేలేదు… ఇంతకి ఈ స్వీట్ వార్నింగ్ ఎఫెక్ట్ కి ఉగాది గిఫ్ట్ రెడీ అవుతోందా? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న, ఫినిష్ చేయబోతున్న మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ మాత్రం తెలంగాణ యోధుడి వారసుడిగా ఇందులో కనిపించబోతున్నాడు. నెగెటీవ్ షేడ్స్ ఉన్న ఏజెంట్ గా కనిపిస్తాడంటున్నారు. ఆల్రెడీ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లోఉంది. ఈనెలాఖర్లోగా క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ ని , రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేస్తే, ఇక షూటింగ్ కి పేకప్ చెప్పేటమే మిగిలి ఉంది.

విచిత్రం ఏంటంటే సడన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్ కావాలంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యష్ రాజ్ బ్యానర్ కి భారీగా స్వీట్ వార్నింగ్స్ పెరిగాయి. కొరటాల శివ లాంటి డైరెక్టర్ కూడా దేవర షూటింగ్ మొదలు పెట్టిన వెంటనే పోస్టర్, తర్వాత మోషన్ పోస్టర్, ఆవెంటనే టీజర్ వదిలాడు. ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చాడు.

అలాంటిది వార్2 మూవీ షూటింగ్ ఏకంగా పూర్తి కావొస్తోంది. ఇంతవరకు ఇందులో ఎన్టీఆర్ లుక్కెలా ఉంటుందో తేల్చలేదు. టీజర్, ప్రోమో దేవుడెరుగు, కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయరా అంటూ సోషల్ మీడియాలో హిందీ నిర్మాతకు ప్రశ్నల వరద పెరిగింది. ఎంతసేపు హైద్రబాద్,ముందై ఏయిర్ పోర్టుల్లో ఎన్టీఆర్ కనిపించటమే తప్ప, వార్ 2 షూటింగ్ అప్ డేట్ మాత్రం రాలేదు.

ఇదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి కోపాన్ని తెప్పిస్తోందట. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇలా సినిమా అప్ డేట్ ఎప్పుడిస్తారంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేయటం బాలీవుడ్ నిర్మాతలకి కొత్తగా ఉంది. అక్కడ మీడియా తప్ప ఫ్యాన్స్ ఎప్పుడూ అప్ డేట్ ని సోషల్ మీడియాలో డిమాండ్ చేసింది లేదు. కాని ఇక్కడ మూకుమ్మడి దాడిలా, తారక్ ఫ్యాన్స్ లక్షల్లో ట్వీట్లు పోస్టులతో వార్ 2 మూవీ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.

యష్ రాజ్ బ్యానర్స్ అంటేనే బాలీవుడ్ లో నెంబర్ వన్ బ్యానర్. అలాంటి నిర్మాతలు ఈ సడన్ ఎటాక్ కి షాక్ అవుతున్నా, తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఫిదా అవుతున్నారు.జనవరి 26 కే పోస్టర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ఉగాదికి మోషన్ పోస్టర్ ని, తారక్ బర్త్ డేకి టీజర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.