కోడి మెడకు 500 కోట్లు… చికెన్ నెక్ విరిచేస్తాడా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పడు ఇండియాలోనే కాదు, చైనా, జపాన్ లో కూడా వార్తల్లోనిలుచునే టైం వచ్చినట్టుంది. ఏకంగా కోడి మెడకు 500 కోట్లు ఖర్చు చేస్తోంది డ్రాగన్ టీం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 06:00 PMLast Updated on: Feb 26, 2025 | 6:00 PM

Intersting Facts About Ntr New Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పడు ఇండియాలోనే కాదు, చైనా, జపాన్ లో కూడా వార్తల్లోనిలుచునే టైం వచ్చినట్టుంది. ఏకంగా కోడి మెడకు 500 కోట్లు ఖర్చు చేస్తోంది డ్రాగన్ టీం. కేజీయఫ్, సలార్ లాంటి హిట్ల తర్వాత ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తీస్తున్న మూవీ అవటంతో అందరి ఫోకస్ ఈ సినిమా మీదే ఉంది. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన డ్రాగన్ చైనీస్, జపనీస్ తో పాటు కొరియా, ఇండోనేషియాలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తన్నారు. అంతవరకు ఓకే కాని, ఒక కోడి 500 కోట్లు.. అది కూడా పూర్తిగా కోడికి కూడా కాదు.. కేవలం కోడి మెడకి 500 కోట్లు ఖర్చు చేస్తోంది ఫిల్మ్ టీం. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారేలా ఉంది. డ్రాగన్ సినిమా పూర్తైతే, ముందుగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎన్టీఆర్ కటౌట్లు, బ్యానర్లు కనిపించేలా ఉన్నాయి. కంటెంట్ కూడా అలాంటిదని తెలుస్తోంది. ఇంతకి నార్త్ ఈస్ట్ ఇండియన్స్ కి నచ్చేలా ఎన్టీఆర్ మూవీలో ఏం ఉండబోతోంది. అసలు 500 కోట్ల కోడి మెడ మ్యాటరేంటి? హావేలుక్

ఎన్టీఆర్ సడన్ గా దేవర జపాన్ రిలీప్ ప్రమోషన్ తో వార్తల్లోకెక్కాడు. కాని తన కొత్త మూవీ డ్రాగన్ వెనకున్న 500 కోట్ల కోడి మెడతో, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకొచ్చేలా ఉన్నాడు. కేజీయఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇక ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్, దేవర హిట్స్ తర్వాత వార్ 2 మూవీ చేస్తూనే డ్రాగన్ కికమిటయ్యాడు. వార్ 2ని వచ్చేనెల్లో పూర్తిచేసి, మార్చ్ ఎండ్ నుంచి డ్రాగన్ సెట్లో బిజీ కాబోతున్నాడు.ఇలాంటి టైంలో 500 కోట్ల కోడి మెడ మీద వార్తలొస్తున్నాయి. అదే చికెన్ నెక్… అంటే ఇండియా, భూటాన్, చైనాని కలిపే చికెన్ నెక్ మీదే డ్రాగన్ కథ ఉండబోతోందట. అంతేకాదు 500 కోట్ల బడ్జెట్ తోతెరకెక్కే ఈసినిమాలో 80శాతం జనాలు నార్త్ ఈస్ట్ ఇండియన్సే అని తెలుస్తోంది. ఆల్రెడీ మణిపూర్ అల్లర్ల కాన్సెప్ట్ తో కొన్ని ధర్నా సీన్లను రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్.

ఎన్టీఆర్ లేకుండానే 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో మహా ధర్మా తాలూకు సీన్లు షూటింగ్ జరుగుతున్నాయి. వారం రోజులుగా ఈ షూటింగ్ జరుగుతోంది. నాగాలాండ్, మణిపూర్ మత ఘర్జనలు, వీటి వెనక చైనా కుట్రలు, అలానే భూటాన్ దేశంతో ముడిపడ్డ అంశం… ఇవన్నీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో డిస్కర్స్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. సో ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ ఇండియా గురించి ఓ ఇండియన్ సినిమా పూర్తి స్తాయిలో తెరకెక్కడం ఇదే మొదలు. చాలా సినిమాల్లో జస్ట్ కొన్ని సీన్లుగా నే నార్త్ ఈస్ట్ ఇండియా గురించి చూపించారు. కాని ఇండో చైనా వార్, అలానే ఇండియా చైనా భూటాన్ బోర్డర్ లో ఉండే పరిస్థితులు… వాటితో హీరోకి ఉండే కనెక్షన్… ఆ ప్రాసెస్ లో జరిగే డ్రగ్స్ వార్…

ఇదే కథాంశంతో డ్రాగన్ రాబోతోంది. కథ అలా ఉంది కాబట్టే, నార్త్ ఈస్ట్ ఇండియా, చైనా, భూటాన్, కి సూటయ్యేలా ఈ మూవీకి డ్రాగన్ గా పేరుపెట్టారని తెలుస్తోంది. ఇక 500 కోట్ల బడ్జెట్ పెట్టి చికెన్ నెక్ గా పిలిచే ఇండో,భూటాన్ బోర్డర్ లో సినిమా తీయటం నిజంగా రిస్కీ ఫ్యాక్టర్. అలాంటి మూవీలో అంతగా కమర్శియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో కాని, 500 కోట్ల ఖర్చుతో కోడి మెడమీద కత్తి పెడుతున్నాడు ప్రశాంత్ నీల్.