6 ప్యాక్స్ to 10 ప్యాక్స్ … అలాని మరీ సన్నబడితే ఎలా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్కవుట్లు స్టార్ట్ చేశాడు. డ్రాగన్ మూవీ కోసం ఆల్రెడీ 15 కిలోల వేయిట్ తగ్గాడు. ఇప్పుడు సిక్స్ ప్యాక్స్ నుంచి టెన్ ప్యాక్స్ కి షిఫ్ట్ కాబోతున్నాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్కవుట్లు స్టార్ట్ చేశాడు. డ్రాగన్ మూవీ కోసం ఆల్రెడీ 15 కిలోల వేయిట్ తగ్గాడు. ఇప్పుడు సిక్స్ ప్యాక్స్ నుంచి టెన్ ప్యాక్స్ కి షిఫ్ట్ కాబోతున్నాడు. అందుకు తగ్గట్టు 50 రోజులు డైట్ ప్లాన్ కి వర్కవుట్ ని యాడ్ చేశాడు. ఆల్రెడీ కెనడా నుంచి ఫిట్ నెస్ ట్రైనర్ వచ్చాడు. హైద్రబాద్ ల్యాండ్ అయ్యాడు. సో ఇక మజిల్స్ పెంచుతూనే, బరువు తగ్గించే ప్రయత్నం మొదలైంది. మొన్నటికి మొన్న వార్ 2 కోసం ముంబై కి వెళ్లినప్పుడే ఎన్టీఆర్ స్లిమ్ గా అల్ట్రా పోష్ లుక్ తో కనిపించాడు. అదే సన్నబడటం అంటే, అంతకుమించి సన్నబడితే ఎలా..? యమదొంగ మూవీ టైంలో కనిపించినట్టు, మరింత సన్నబడతాడా? టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేయాలంటే ఎలాంటి వాళ్లైనా బక్క పలుచగా మారాల్సి వస్తుంది..మరి టెన్ ప్యాక్స్ మాయలోపడి తారక్ మరీ రిస్క్ చేస్తున్నాడా? డ్రాగన్ కి టెన్ ప్యాక్స్ కి ఉన్న లింకేంటి? హావేలుక్
అరవింద సమేత వీర రాఘవలో సిక్స్ ప్యాక్స్ తో కనిపించిన ఎన్టీఆర్, ఇప్పుడు టెన్ ప్యాక్స్ కోసం 15 కిలోల వేయిట్ తగ్గాడు. డ్రాగన్ కోసం స్పెషల్ డైటే కాదు, స్పెషల్ ఫిట్ నెల్ మాస్టర్ ని కెనడా నుంచి ఇండియాకు ఇంపోర్ట్ చేసుకున్నాడు. అయితే ఇంతగా టెన్ ప్యాక్స్ తో అవసరమేమొచ్చిందనేదే ఇక్కడ ప్రశ్న…టెంపర్ లో కాస్త బొద్దుగా ఉన్నా ఫిట్ నెట్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్, తర్వాత అరవింద సమేతలో సిక్స్ ప్యాక్స్ తో షాక్ ఇచ్చాడు. ఇక త్రిబుల్ ఆర్ లో కండలు పెంచి కాస్త బలంగానే కనిపించిన తను, దేవరలో జుట్టు పెంచి లుక్ మార్చాడు. ఇలా ప్రతీ మూవీకి, తన లుక్స్ ట్రాన్స్ ఫామ్ అవుతూనే ఉన్నాయి.
ఇదంతా యమదొంగ నుంచే మొదలైంది. యమదొంగకి ముందు బొద్దుగా ఉన్న తారక్, ఈ సినిమా తోనే సన్నబడ్డాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి రోజులే వచ్చేలా ఉన్నాయి. రీసెంట్ గా ముంబై ఏయిర్ పోర్ట్ లోస్లిమ్మైన తారక్ అల్ ట్రా పోష్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేసింది.కట్ చేస్తే టెన్ ప్యాక్స్ కోసం మరింత పలుచగా తను తయారయ్యేలా ఉన్నాడని తెలుస్తోంది. అదే జరిగింది మరీ సన్నగా ఉంటే అసలుకే ఎసరొస్తుందా? టెన్ ప్యాక్స్ కోసం హెల్త్ రిస్క్ చేస్తున్నాడా? ఇలాంటి టౌట్లొస్తున్నాయి. ఐతే అన్నీ స్పెషలిస్టుల పర్యవేక్షనలోనే జరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు..
కానిడ్రాగన్ లో పాత్ర కోసం ఇలా తను మరింత సన్నపడటం అవసరమా అంటే, టెన్ ప్యాక్స్ కోసమే కాదు డ్రాగన్ రోల్ కోసం తప్పట్లేదు. ఇందులో 90శాతం సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ లోనే జరుగుతుందట. సో టీనేజర్ లుక్ లోకి మారేందుకే ఎన్టీఆర్ ప్రయత్నం అని తెలుస్తోంది. ఓ 17 ఏళ్ల కుర్రాడి జర్నీ, ఎంత పెద్ద మాఫియాని ఫేస్ చేసే వరకు వెళ్లిందనే పాయింట్ తో ఈ సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.అంటే ఇండో, చైనా, బోర్డర్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈసినిమాలో 10 శాత మాత్రమే కండలు తిరిగిన తారక్ లుక్ అవసరం ఉంటుందట. 90శాతం టెన్స్ ప్యాక్స్ తో కనిపించే టీనేజర్ పాత్ర వల్ల, తను సన్న పడక తప్పట్లేదని తెలుస్తోంది.