50వ సినిమాతో… 2000 కోట్ల కోరిక…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సితారా ఎంటర్ టైన్ మెంట్ లో లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సినిమా ప్లాన్ చేశాడు నిర్మాత నాగ వంశీ. అంతవరకు బానే ఉంది కాని, ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే బాంబు పేల్చాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సితారా ఎంటర్ టైన్ మెంట్ లో లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సినిమా ప్లాన్ చేశాడు నిర్మాత నాగ వంశీ. అంతవరకు బానే ఉంది కాని, ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే బాంబు పేల్చాడు. వాళ్ల బ్యానర్ లో వచ్చే 50 వ మూవీ ఓరేంజ్ లో ఉండాలి కాబట్టే, ఎన్టీఆర్ తో సాలిడ్ ప్రాజెక్టుని ప్లాన్ చేశాడట. ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డినే అడ్డు పడేలా ఉన్నాడని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన ట్రెండ్ సెట్టర్ సందీప్ రెడ్డి వంగ. అలాంటి తను ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ లాంచ్ చేయబోతున్నాడు. ఉగాదికి లాంచ్, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ.. అలా తను బిజీ అవుతుంటే, తనే ఎన్టీఆర్ తో సితార టీం ప్లాన్ చేసిన వాళ్ల 50వ సినిమాకు అడ్డు పడుతున్నాడంటున్నారు. ఈ విషయంలో సందీప్ రెడ్డితో ఫైట్ చేసి మరి, సూపర్ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతున్నాడు నిర్మాత.. ఏకంగా 800 కోట్ల బడ్జెట్ తో జైలర్ ఫేం తీయబోతున్న ఆ ప్రాజెక్ట్ ఏంటి? రజినీకాంత్ సినిమా తీస్తున్న ఆ దర్శకుడికి ఎన్టీఆర్ మూవీతోనే ఎందుకు ఎగ్జెట్ చేస్తోంది? టేకేలుక్
ఎన్టీఆర్ వార్ 2 పెండింగ్ ప్యాచ్ వర్క్, సాంగ్ షూటింగ్ లో మిగిలిపోయిన పెండింగ్ పోర్షన్ ని ఏప్రిల్ 20 లోగా పూర్తి చేయబోతున్నాడు. ఇప్పుడు దేవర ప్రమోషన్ కోసం జపాన్ లో టైం స్పెండ్ చేసే పనిలో ఉన్నాడు.వచ్చే వారమే దేవర జపనీస్ వర్షన్ అక్కడ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి టైంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ బాంబు పేల్చాడు.
సితార బ్యానర్ లో రాబోయే 50వ సినిమా ఎన్టీఆర్ దే అని తేల్చాడు. నిజానికి ఎన్టీఆర్ వార్ 2 పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి. దానికి 12 రోజుల టైం సరిపోతుంది. తర్వాత ఏప్రిల్ 21 నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు తారక్. ఆతర్వాతే 3 సినిమాల్లో ముందు సందీప్ రెడ్డి వంగదే ముందు పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది
ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేసేలోపు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ ని పూర్తిచేస్తాడు. ఆతర్వాత ఈ ఇద్దరి సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకెళుతుందని ప్రచారం జరుగుతోంది. కాని సందీప్ రెడ్డితో పోటీ పడి మరీ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఆఫర్ ని పట్టేసే పనిలో ఉన్నాడు నాగవంశీ. మరి ఎన్టీఆర్ నుంచి తన టీం నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్ మేషన్ రాకున్నా, ప్రొడ్యూసర్ నాగ వంశీ మాత్రం తమ బ్యానర్ లో తెరకెక్కే 50వ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దే అన్నాడు
అంతేకాదు ఆఫ్ ద రికార్డ్ ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ తీసి, జైలర్ 2 ని పట్టాలెక్కించిన నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లోనే నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా కూడా కన్ఫామ్ అయ్యిందని తెలుస్తోంది. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వాళ్ల బ్యానర్ లో 50వ మూవీ ప్లాన్ చేశారు. కాని డెప్యూటీ సీఎం మళ్లీ సినిమాల వైపు అడుగులేయటం కష్టం కాబట్టి, తనతో ఆ ఆలోచన మానేశారట
ఏదేమైనా వార్ 2, డ్రాగన్ తో బిజీ అయిన ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ కథ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టైంలోనే, నాగవంశీ ఇలా బాంబు పేల్చాడు. హీరోయిన్ గా ఆలియా, బడ్జెట్ 800 కోట్లని క్లియర్ కట్ గా చెప్పాడంటే, ఆల్ మోస్ట్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టే డ్రాగన్ తర్వాత తెరకెక్కే ఛాన్స్ఉంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ 2 మూవీ తీస్తున్న నెల్సన్ దిలీప్ కూడా తారక్ తో సినిమా తీసేందుకు ఈగర్ గా వేయిట్ చేస్తున్నా అన్న స్టేట్ మెంట్ కూడా షాక్ ఇస్తోంది. ఓవైపు రజినీ సినిమా తీస్తూ కూడా ఎన్టీఆర్ మూవీ కోసం వేయిట్ చేస్తున్నా అనటం తారక్ ఫ్యాన్స్ ని సంతోషపెట్టే విషయమే కాని, రజినీకాంత్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించే స్టేట్ మెంటే అది..