మ్యాన్ ఆఫ్ మాసెస్ VS ఐకాన్ స్టార్… ఈ సారి నో జాలి.. నో కరుణ…

పుష్ప2 మూవీ వచ్చినప్పుడు అసలు మార్కెట్ లో పోటీనే లేదు. దేవర ఏమాత్రం రిలీజ్ డేట్ వాయిదా పడ్డా, పుష్ప రాజ్ కి దేవర పంచ్ ఇచ్చేవాడనే మాటలు వినిపించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2025 | 04:35 PMLast Updated on: Feb 17, 2025 | 4:35 PM

Intersting Facts About Ntr Vs Allu Arjun Movies

పుష్ప2 మూవీ వచ్చినప్పుడు అసలు మార్కెట్ లో పోటీనే లేదు. దేవర ఏమాత్రం రిలీజ్ డేట్ వాయిదా పడ్డా, పుష్ప రాజ్ కి దేవర పంచ్ ఇచ్చేవాడనే మాటలు వినిపించాయి. ఇక కల్కీ కూడా ఓరకంగా పుష్ప 2 ని ఇబ్బంది పెట్టకుండా, చాలా ముందే వచ్చి 1200 కోట్లు రాబట్టాడు. కాని ఇక మీదట అలాంటి పరిస్థితికి ఛాన్సేలేదు. సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు, దసరా నుంచి దీపావళి వరకు , గట్టు దాటేస్తుంటే వేసేయటమే… అంతగా ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు బన్నీ మూవీకి పంచ్ ఇచ్చేలా ఉన్నాయి. వణికించేలా ముహుర్తాలు కుదిరాయి. త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ చేయబోతున్న సినిమా సమ్మర్ లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కాని సంక్రాంతికనుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ సమ్మర్ కే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఫౌజీ మూవీ కూడా కుదిరితే సమ్మర్ లేదంటే, 2026 దసరాకంటున్నారు. ఇలా చూస్తే బన్నీ కొత్త మూవీకి అడుగడుగునా గండం ఉండేలా ఉంది… పుష్పరాజ్ కి కుదిరినంత సోలో రిలీజ్ ఇక మీదట కుదిరేలా లేకుండా పోతోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, వర్సెస్ మెగా స్టార్ చిరంజవి అని మొన్నటి వరకు అన్నారు. వచ్చే సంక్రాంతికి చిరు విశ్వంభరతో ఎన్టీఆర్ డ్రాగన్ పోటీ అన్నారు. కాని పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ మూవీ సమ్మర్ కి దాడి చేసేలా ఉంది. ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ డిసెంబర్ లోగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ 3 నుంచి 4 నెల్ల టైం తీసుకున్నా, మేలో డ్రాగన్ రావటం పక్కా అంటున్నారు.ఐతే ఇప్పుడే బన్నీ వర్సెస్ ఎన్టీఆర్ అన్న డిస్కర్షన్ మొదలవ్వటానికి రీజన్, డ్రాగన్ వేట ఈ సారి జాలిలేకుండా ఉండటమే… మొన్నటికి మొన్న పుష్ఫ 2 వచ్చి 1900 కోట్లు రాబట్టిందని పోస్టర్లు వదిలారు. సరే లెక్కలెలా ఉన్నా, పుష్పరాజ్ వచ్చినప్పుడు పోటీకి మరే పాన్ ఇండియా మూవీ తనకి పోటీ ఇవ్వలేదు. వాయిదాలు పడి ఎక్కడ దేవర మూవీ పుష్ప2 కి పోటీ ఇస్తుందో అని ఫిల్మ్ టీం కంగారు పడింది.

కాని సెప్టెంబర్ లోనే దేవర వస్తే, అంతకుముందే కల్కీగా రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చాడు. ఆతర్వాత తీరిగ్గా, అస్సలు పోటీ లేకుండా పుష్ప2 వచ్చింది. వసూళ్ల వరదతో పోటెత్తింది. అంతవరకు ఓకే కాని ఇక మీదట అంటే 2026 సంక్రాంతి నుంచి ఇక పాన్ ఇండియా సినిమాల జాతర మామూలుగా ఉండేలా లేదు. ఎన్టీఆర్, ప్రభాస్ నుంచే భారీ ఎత్తున పాన్ ఇండియా దండయాత్రలు కనిపించేలా ఉన్నాయి.ముందునుంచే రిలీజ్ డేట్ అనుకుంటున్నారు కాబట్టి, డ్రాగన్, ది రాజా సాబ్, ఫౌజీ ఇలా ఇవేవి విడుదల విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. కాబట్టి త్రివిక్రమ్ తో బన్నీ ప్లాన్ చేసిన మూవీ, ఆట్లీతో ప్లాన్ చేస్తున్న సినిమా, ఈ రెండీంటికి చుక్కెదురయ్యేలా ఉంది.

ఎంతగొప్ప స్టారైనా, ఎంతగొప్ప సినిమా వస్తోందన్నా, రిలీజ్ కి పండగ సీజన్ లేదంటే, సమ్మర్ సీజన్ కలిసొస్తుంది. సో త్రివిక్రమ్ మేకింగ్ లో 4 వ సినిమా చేయబోతున్న బన్నీ, ఆ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాంచాలనుకంటున్నాడు. కాని అప్పుడు పోటీగా వచ్చేలా ఉంది డ్రాగన్. కనీసం రెండు నెలలు ఈసినిమా సందడే ఉంటుంది. తర్వాత 2026 దసరాలో దుమ్ముదులపాలనుకుంటే, ఫౌజీని ఆ సీజన్ కి ప్లాన్ చేశారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ 2026 లో దీపావళి లేదంటే, క్రిస్మస్ కి అనుకుంటున్నారు. ఇలా చూస్తే 2026 నుంచి కనీసం మూడేళ్ల వరకు కలిసొచ్చే పండగలు, సమ్మర్ సీజన్లన్నీ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ పంచుకునేలా ఉన్నారు. కాబట్టి పుష్ప2 లా పోటీ లేని పరిస్థితులు మాత్రం కలిసొచ్చే ఛాన్స్ నిల్..